Viral: భార్య జంప్ జిలానీ.. ఫిర్యాదు చేసిన భర్త.. కట్ చేస్తే.. మరో వ్యక్తి ఎంట్రీతో దిమ్మతిరిగే షాక్!
ఇప్పుడు మీకు మేము చెప్పబోయే స్టోరీ వింటే.. కచ్చితంగా షాక్ కావడం ఖాయం. అంతేకాదు అందులో ఉండే ట్విస్టులు..
ఇప్పుడు మీకు మేము చెప్పబోయే స్టోరీ వింటే.. కచ్చితంగా షాక్ కావడం ఖాయం. అంతేకాదు అందులో ఉండే ట్విస్టులు ఫ్యూజులు ఎగిరిపోయేలా చేస్తాయి. సో లేట్ వద్దు.. వాచ్ దిస్ స్టోరీ..
వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్రకు చెందిన ఓ మహిళ కొన్ని సంవత్సరాల క్రితం మొదటి భర్తను ప్రేమించి.. పెళ్లి చేసుకుంది. వీరి మధ్య బంధం బలపడింది. ఇద్దరు పిల్లలు పుట్టారు. అంతా సాఫీగానే జరుగుతోంది. వెయిట్.. వెయిట్.. కొంచెం రివైండ్ చేస్తే.. ఆమెకు నాలుగేళ్ల కిందట అజ్ఞాత వ్యక్తి దగ్గర నుంచి ఓ మిస్డ్ కాల్ వచ్చింది. ఆ వ్యక్తితో పరిచయం మొదలైంది.. ఆ తర్వాత అది ప్రేమకు దారి తీసింది. సీన్ కట్ చేస్తే..
సదరు మహిళ రెండో లవర్‌తో జంప్ జిలానీ. అనంతరం వారిద్దరూ రెండేళ్ల కిందట నాగ్‌పూర్ శివారులోని ఓ దేవాలయంలో పెళ్లి చేసుకున్నారు. మొదటి భర్త తాపీ మేస్త్రీ పని చేస్తుండగా.. రెండో భర్త ఆప్టికల్ ఫైబర్ అల్లుతుంటాడట. రెండో భర్తతో హాయిగా జీవనం సాగిస్తున్న ఆమెకు ఇటీవల మరో వ్యక్తి సోషల్ మీడియాలో పరిచయం అయ్యాడు. మళ్లీ సేమ్ సీన్ రిపీట్.. రెండో భర్తకు పుట్టింటికి వెళ్లి వస్తానని చెప్పి.. ఆ మహిళ మూడో వ్యక్తితో లేచిపోయింది. ఇలా 25 ఏళ్లలోపు ఉన్న ఆ మహిళ ఇంత రచ్చ చేయడంతో.. ఆగ్రహించిన రెండో భర్త.. మొదటి భర్తతో కలిసి మూడో వ్యక్తి పని తేల్చేందుకు సిద్దమయ్యాడు.
అందులో భాగంగానే మొదటి భర్తను కాంప్రమైజ్ చేసి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎక్కడా కూడా గృహ హింస అనేది లేకపోవడంతో పోలీసులు ఈ ఇద్దరు భర్తలకు ఎలాంటి న్యాయం చేస్తారో.?