Viral: అందరూ కులాసాగా టీవీ చూస్తుంటే.. ఒక్కసారిగా దూసుకొచ్చిన అనుకోని అతిధి..
పాములంటే చాలా మందికి చచ్చేంత భయం. అవి దూరం నుంచి కనిపించినా.. ఆమడదూరం పారిపోతారు. అయితే ఇటీవల..
పాము.. ఈ పేరు వింటేనే కొంతమందికి వెన్నులో వణుకు పుడుతుంది. ఎందుకంటే అవి భూమి మీద ఉండే అత్యంత డేంజరస్ యానిమల్స్‌లో ఒకటి. అవి కాటేస్తే చాలు కాటికెళ్లినట్లే. అందుకే పాములంటే చాలా మందికి చచ్చేంత భయం. అవి దూరం నుంచి కనిపించినా.. ఆమడదూరం పారిపోతారు. అయితే ఇటీవల పాములు తమ ఆవాసాలను వదిలేసి.. జనావాసాల్లోకి వచ్చేస్తున్నాయి. దీనితో జనాల గుండెల్లో గుబులు పుడుతోంది. తాజాగా అలాంటి సంఘటనే ఒకటి జరిగింది. ఆ కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
వివరాల్లోకి వెళ్తే.. బ్రిటన్‌లోని బర్మింగ్‌హామ్ హాడ్జ్ హిల్ ప్రాంతానికి చెందిన ఓ కుటుంబం ఇంట్లో ఎంచక్కా టీవీ చూస్తూ ఎంజాయ్ చేస్తుండగా.. 5 అడుగుల పొడవున్న విషసర్పం అనుకోని అతిధిలా వారిని వచ్చి పలకరించింది.దీనితో దెబ్బకు దడుసుకున్న ఆ కుటుంబం వెంటనే వేరే గదిలోకి పారిపోయింది. ఇక సమాచారం అందుకున్న రెస్క్యూ అధికారులు అక్కడికి చేరుకున్నారు. సోఫా కింద దాక్కున్న పామును చాకచక్యంగా పట్టుకున్నారు. ప్రస్తుతం ఆ రెస్క్యూ ఆపరేషన్‌కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Psst – “You’re under arresssssst”!
A police officer’s day is never dull – as one of our response teams found when called to help a family who’d found a snake in their home!
Read what happened here ?https://t.co/MoGKa1bbad pic.twitter.com/tZjIr60Jl1
— West Midlands Police (@WMPolice) June 19, 2022
‘ఆ ఇంట్లోకి పాము పైపుల ద్వారా వచ్చి ఉంటుందని అనుమానిస్తున్నాం. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ క్షేమంగానే ఉన్నారు’ అని ఓ అధికారి మీడియాకు తెలియజేశారు. ఇక ఆ ఇంట్లో నివాసముంటున్న కుటుంబం.. ఈ ఘటన అనంతరం అక్కడ నుంచి ఖాళీ చేసి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.