Viral: ‘పెళ్లి, హనీమూన్ ఖర్చులన్నీ అతిధులే భరించాలట’.. వధువు షరతులు చూస్తే మైండ్ బ్లాంకే!
ఒకవేళ గిఫ్ట్ తీసుకెళ్లకపోయినా 'ఏం గిఫ్ట్ తేలేదా బాబూ.. భోజనం చేసి పోదాం' అని వచ్చావా అని ఎవ్వరూ కూడా మనల్ని అడగరు.
మనం ఎవరి పెళ్లికైనా వెళ్లినప్పుడు గిఫ్ట్స్ తీసుకెళ్లడం సర్వసాధారణం. ఒకవేళ గిఫ్ట్ తీసుకెళ్లకపోయినా ‘ఏం గిఫ్ట్ తేలేదా బాబూ.. భోజనం చేసి పోదాం’ అని వచ్చావా అని ఎవ్వరూ కూడా మనల్ని అడగరు. అయితే ఇక్కడొక వధువు మాత్రం ఏకంగా తన పెళ్ళికి అతిధులను ఆహ్వానిస్తూ కొన్ని షరతులు పెట్టింది. అవేంటో తెలిస్తే మైండ్ బ్లాంక్ అయిపోతది.
ఆ వధువుకు సంబంధించిన ఆన్‌లైన్ వెడ్డింగ్ కార్డును ఓ యూజర్ రెడ్డిట్‌లో పోస్ట్ చేశాడు. ఆ జంట పెళ్ళికి 30 వేల డాలర్లు(అక్షరాల ఇండియన్ కరెన్సీలో రూ. 23 లక్షలు) అవుతుంది. వీడియోగ్రాఫర్, వెడ్డింగ్ డ్రెస్, పెడిక్యూర్, మ్యానిక్యూర్, హనీమూన్‌తో సహా అన్ని ఖర్చులూ అతిధులే భరించాలట. తన పెళ్ళికి ఎవ్వరూ గిఫ్ట్స్ తీసుకురావద్దని.. వీటన్నింటికీ అయ్యే ఖర్చుకు కావాల్సిన మొత్తాన్ని మాత్రమే తీసుకురావాలని వధువు వెడ్డింగ్ కార్డులో పేర్కొంది.
“అతిధుల సంఖ్య కచ్చితంగా125 ఉండాలి. ఇక ప్రతి ఒక్కరూ కనీసం 250 డాలర్లు విరాళంగా అందించాలి. అది కూడా వచ్చే వాళ్లందరూ కూడా పిల్లలు లేని, కళాశాల చదువు పూర్తి కాని వాళ్లు మాత్రమే రావాలి” అని వెడ్డింగ్ కార్డులో పేర్కొంది.
కాగా, ఈ వింత ఆన్‌లైన్ వెడ్డింగ్ కార్డు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు.