Viral: అట్లుంటది మరి.. ఈ వీడియో చూస్తే మందుబాబులు గుండెలు బాదుకుంటారు.. అయ్యో అయ్యో అయ్యయ్యో.!
ఈ వీడియో చూస్తే మందుబాబులు గుండె గుభేల్ అంటుంది. ఒకటి.. కాదు.. రెండు కాదు.. ఏకంగా 11 వేలకు పైగా లిక్కర్ బాటిల్స్..
వందా?, రెండొందలా? ఏకంగా 20వేల లిక్కర్ బాటిల్స్‌ను ధ్వంసం చేశారు కాకినాడ పోలీసులు. లక్షల రూపాయల విలువైన మద్యాన్ని జేసీబీతో తొక్కించి భూమిలో కలిపేశారు. మందుబాబులంతా అయ్యో అనేలా, పెద్దఎత్తున మద్యాన్ని ధ్వంసం చేశారు కాకినాడ పోలీసులు. తాళ్లరేవులో సుమారు 20వేల మద్యం బాటిళ్లను పగలగొట్టారు. రెయిడ్స్‌లో పట్టుకున్న అక్రమ మద్యాన్ని ఊరు చివరనున్న డంపింగ్ యార్డ్‌కి తీసుకొచ్చి ధ్వంసం చేశారు. పోలీస్ అధికారులు స్వయంగా అక్రమ మద్యాన్ని పారపోయగా, అనంతరం, మొత్తం మద్యం బాటిళ్లను ఒకచోట చేర్చి, జేసీబీతో ధ్వంసం చేశారు. ఇక్కడ ధ్వంసం చేసిన మద్యం బాటిల్స్ అన్నీ కాకినాడ సౌత్ అండ్ నార్త్ పోలీస్ స్టేషన్ల పరిధిలో పట్టుకున్నవని పోలీసులు తెలిపారు. ధ్వంసం చేసిన బాటిల్స్‌లో నాన్ సర్టిఫైడ్ మద్యం ఉందని, ఇది తాగితే ప్రజల ప్రాణాలకే ప్రమాదకరం అంటున్నారు పోలీస్ అధికారులు.
మొత్తం 11 వందల 35 బాక్సుల మద్యాన్ని ధ్వంసం చేశారు. ఇందులో 17 వేల 946 బాటిల్స్ నాన్ డ్యూటీ ఫైడ్ లిక్కర్ బాటిల్స్ ఉన్నాయన్నారు పోలీసులు. ప్రాణాలను హరించే నాన్ డ్యూటీ ఫైడ్ లిక్కర్‌తో ప్రాణాలకే ప్రమాదమంటున్నారు. అందుకే, ఇలాంటి నాన్ సర్టిఫైడ్ మద్యానికి ప్రజలు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు పోలీసులు.