Viral Photo: మైండ్ బ్లాంక్ అయితది.. ఈ ఫోటోలో గుర్రాన్ని కనిపెడితే మీరే కిర్రాక్..
ఈ ఫొటోస్ మన కళ్ళను ప్రతీసారి మోసం చేస్తుంటాయి. పైకి సమాధానం కనిపిస్తున్నా.. దాన్ని కనిపెట్టలేం. అందుకే ఇలాంటి పజిల్స్ సాల్వ్..
ఇంటర్నెట్‌లో తరచూ రకరకాల ఫోటోలు వైరల్ అవుతుంటాయి. అయితే అందులో కొన్ని ప్రత్యేకమైనవి. వాటిల్లో దాగున్న రహస్యాలను కనుగొనేందుకు నెటిజన్లు విపరీతంగా ఆసక్తిని కనబరుస్తారు. అలాంటి వాటినే ఫోటో పజిల్స్, ఆప్టికల్ ఇల్యూషన్స్ అని అంటారు. ఈ ఫొటోస్ మన కళ్ళను ప్రతీసారి మోసం చేస్తుంటాయి. పైకి సమాధానం కనిపిస్తున్నా.. దాన్ని కనిపెట్టలేం. అందుకే ఇలాంటి పజిల్స్ సాల్వ్ చేయాలంటే మెదడుకు పదును పెట్టడమే కాదు.. కళ్లు కూడా డేగ కళ్ళలా ఉండాలి. వీటికంటూ సోషల్ మీడియాలో ప్రత్యేకంగా పేజీలు సైతం ఉన్నాయి. ఎప్పటికప్పుడూ సరికొత్త ఫోటో పజిల్స్‌ను అందిస్తుంటాయి. తాజాగా ఆ కోవకు చెందిన ఓ ఫోటో పజిల్ సోషల్ మేదిలావు వైరల్ అవుతోంది.
పైన పేర్కొన్న ఫోటోలో ఓ గుర్రం దాగుంది. అదెక్కడుందో మీరు గుర్తించాలి. చూడటానికి అదొక స్ట్రీట్‌లా ఉంది కదూ.. ఓ అపార్ట్‌మెంట్.. దాని పక్కనే చిన్న ఇల్లు.. అక్కడెక్కడో ఈ గుర్రం కూడా దాగుంది. చూడండి కనిపిస్తుందేమో.. కనిపెట్టమని సవాల్ విసురుతోంది. ఒక్కసారి ట్రై చేయండి. మీరు మేధావులైతే.. ఈజీగా కనిపెట్టేస్తారు. ఒకవేళ అలా లేదంటే సమాధానం కోసం కింద ఫోటోను చూడండి.
here is the answer pic.twitter.com/SJca0609ri
— telugufunworld (@telugufunworld) June 21, 2022