అతడి పక్షి ప్రేమకు హాట్సాఫ్‌.. వాటికోసం రోజూ టన్నుల కొద్దీ ధాన్యం వెదజల్లుతాడు.. వీడియో చూస్తే పడిపోతారు..

ఈ పక్షులన్నీ ఎప్పుడు దిగి తమ ధాన్యం గింజలు, నీటిని తింటామా అని ఎదురు చూస్తున్నాయి. ఈ మనిషి పక్షుల కోసం ప్రతిరోజూ ధాన్యపు గింజలను పైకప్పుపై చల్లుతాడు. పక్షులు వాటిని తినడానికి ఆసక్తిగా ఎదురుచూస్తాయి.

అతడి పక్షి ప్రేమకు హాట్సాఫ్‌.. వాటికోసం రోజూ టన్నుల కొద్దీ ధాన్యం వెదజల్లుతాడు.. వీడియో చూస్తే పడిపోతారు..
Birds Everyday
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 21, 2022 | 4:07 PM

సాధారణంగా జంతుప్రేమికులు, పక్షిప్రేమికులు తమ ఇళ్లలో వాటిని పెంచుకుంటారు. చాలా మంది ఇళ్లలో రామచిలుకలు, పావురాలను పెంచుకోవటం చూస్తుంటాం..కానీ, నేటి ద్రవ్యోల్బణం, రోజువారీ జీవితంలో ఎక్కువ బిజీ కారణంగా ప్రజలు తమ అభిరుచులను కూడా తగ్గించుకుంటున్నారు. కానీ ఒకేసారి వేలాది పక్షులకు ధాన్యం తినిపించడం అనేది నిజంగా పూర్తిగా భిన్నమైన, ఓ గొప్ప ఆలోచనగా చెప్పాలి. సరిగ్గా ఇక్కడ అదే చేస్తున్నాడు ఓ వ్యక్తి. సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్‌ అవుతోంది. వీడియోలో టెర్రస్‌పై కిలోల కొద్ది ధాన్యాన్ని చల్లడం కనిపిస్తుంది. అక్కడ కనిపిస్తున్న టెర్రస్‌ చాలా పెద్దది. ఓ వ్యక్తి పైకప్పుపై ధాన్యం చల్లుతుండగా.. వందలాది పక్షులు ఆకాశంలో ఎగురుకుంటూ రావటం కెమెరాలో బంధించబడింది.

ఈ పక్షులన్నీ ఎప్పుడు దిగి తమ ధాన్యం గింజలు, నీటిని తింటామా అని ఎదురు చూస్తున్నాయి. ఈ మనిషి పక్షుల కోసం ప్రతిరోజూ ధాన్యపు గింజలను పైకప్పుపై చల్లుతాడు. పక్షులు వాటిని తినడానికి ఆసక్తిగా ఎదురుచూస్తాయి. అతడు గింజలు బిల్డింగ్‌ పైకప్పుపై చల్లేసి, నీళ్లు కూడా పెట్టి అక్కడి నుండి దూరంగా వెళ్ళిన వెంటనే ఆ పక్షులన్నీ వాలిపోతాయి. వైరల్‌ అవుతున్న వీడియోలో చాలా చిలుకలు ఆ గింజల కోసం వస్తున్నాయి. ఒకేచోట వాలిన వందల చిలుకలు గింజలు తినడంలో బిజీగా ఉన్నాయి. వందలాది రంగురంగుల చిలుకలను ఒకచోట చూడటం ఒక విభిన్నమైన అనుభవం. సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్న ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

ఈ వీడియోను చూసిన నెటిజన్లు చాలా సంతోషిస్తున్నారు. భారం అనుకోకుండా అన్ని పక్షులకు ఆహారం అందిస్తున్న ఈ వ్యక్తిని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. వీడియో చూస్తే నిజంగా ఆ వ్యక్తిది ఎంత గొప్ప మనసో కదా అని కొనియాడుతున్నారు. నిజంగానే అతడు మనిషిలోని దేవుడిగా భావిస్తున్నారు. కాగా, ఈ వీడియోకి మిలియన్ల కొద్దీ వీక్షణలు వచ్చాయి.ఈ వీడియో ఆన్‌లైన్‌లో షేర్‌ చేసిన వెంటనే వైరల్‌గా మారింది. ఇప్పటివరకు ఈ వీడియోను 5.3 మిలియన్ల మంది వినియోగదారులు వీక్షించారు.318k వినియోగదారులు ఈ వీడియోను లైక్‌ చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే