Governament school: ప్రభుత్వ పాఠ‌శాల‌లో చేరితే ఒక్కో విద్యార్థికి రూ. ఐదువేలు.. సర్కార్‌ కీలక నిర్ణయం!

సర్కార్‌ విద్యా వ్యవస్థను మరింత పదునుగా మార్చేందుకు ప్రభుత్వం ప్రణాళిక బద్దంగా ముందుకు వెళ్తోంది. కానీ, ప్రభుత్వ విద్యాలయాలపై ప్రజల్లో ఉన్న భావన మాత్రం పోవటం లేదు. వేల కోట్లరూపాయలు విద్య కోసం ఖర్చు చేస్తున్నా..

Governament school: ప్రభుత్వ పాఠ‌శాల‌లో చేరితే ఒక్కో విద్యార్థికి రూ. ఐదువేలు.. సర్కార్‌ కీలక నిర్ణయం!
Governament School
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 20, 2022 | 8:45 PM

సర్కార్‌ విద్యా వ్యవస్థను మరింత పదునుగా మార్చేందుకు ప్రభుత్వం ప్రణాళిక బద్దంగా ముందుకు వెళ్తోంది. కానీ, ప్రభుత్వ విద్యాలయాలపై ప్రజల్లో ఉన్న భావన మాత్రం పోవటం లేదు. వేల కోట్లరూపాయలు విద్య కోసం ఖర్చు చేస్తున్నా ప్రభుత్వ పాఠశాలల్లో చేరే విద్యార్థుల సంఖ్య నామమాత్రంగానే ఉంటుంది. విద్యార్థుల చేరికను పెంచేందుకు మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా కీసర మండలం గోధుమకుంటలో ప్రజాప్రతినిధులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ పాఠ‌శాల‌లో చేరే ప్రతి ఒక్క విద్యార్థికి ఐదు వేల రూపాయ‌లు ఇస్తామంటూ స‌ర్పంచ్ ఆకిటి మ‌హేంద‌ర్ రెడ్డి, ఉప సర్పంచ్ ఆంజనేయులు ప్రకటించారు.

ప్రభుత్వ పాఠశాలల్లో చేరే విద్యార్థుల సంఖ్య రోజు రోజుకి తగ్గిపోతుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలలకు పునరుజ్జీవం కల్పించేందుకు ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతుంది. ప్రభుత్వం విద్య కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తూ ఉంటుంది. అయినప్పటికీ తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలలో చేర్పించేందుకు మొగ్గుచూపుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రంలోని మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా కీసర మండలం గోధుమకుంటలో ప్రజాప్రతినిధులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అంతేకాకుండా దాతల సహాయంతో అన్ని వసతులతో పాటు పచ్చని చెట్లతో ఆహ్లాదకరమైన వాతావరణం కల్పిస్తామన్నారు.

ఇవి కూడా చదవండి

అంతేకాక విద్యార్థులకు ఉచితంగా రెండు జతల యూనిఫాం ,బూట్లు, సాక్సులు, బస్ పాస్ అందిస్తామని పేర్కొన్నారు. ప్రకటించిన నజరానాల వివరాలతో ప్రభుత్వ పాఠశాల ప్రవేశ ద్వారం వద్ద ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ ఫ్లెక్సీ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.