White Hair Solution: తెల్లజుట్టుకు శాశ్వత పరిష్కారం! ఇలాంటి సూపర్‌ఫుడ్‌తో మెరిసే అందమైన శిరోజాలు..

ప్రస్తుత కాలంలో అనేకమంది తెల్లజుట్టు సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. చాలా మందికి చిన్న వయసులోరు తెల్ల జుట్టు సమస్య వేధిస్తోంది. మరీముఖ్యంగా ఈరోజుల్లోని యువత ఎక్కువ శాతం తెల్లజుట్టు సమస్యతో బాధపడుతున్నారు.

White Hair Solution: తెల్లజుట్టుకు శాశ్వత పరిష్కారం! ఇలాంటి సూపర్‌ఫుడ్‌తో మెరిసే అందమైన శిరోజాలు..
White Hair Solution
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 20, 2022 | 9:00 PM

White Hair Solution: ప్రస్తుత కాలంలో అనేకమంది తెల్లజుట్టు సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. చాలా మందికి చిన్న వయసులోరు తెల్ల జుట్టు సమస్య వేధిస్తోంది. మరీముఖ్యంగా ఈరోజుల్లోని యువత ఎక్కువ శాతం తెల్లజుట్టు సమస్యతో బాధపడుతున్నారు. కొంతమంది దీనిని జన్యుపరమైన జుట్టు సమస్యగా భావించినప్పటికీ, కొందరు తెల్ల జుట్టుతో రాజీపడలేకపోతుంటారు. థైరాయిడ్, రక్తహీనత, జుట్టులో పోషకాల లోపం వంటి వ్యాధుల వల్ల ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే దీన్ని వదిలించుకునే అవకాశం ఉందంటున్నారు వైద్య నిపుణులు. సూపర్ ఫుడ్స్‌ని మీ డైట్‌లో భాగం చేసుకోవడం వల్ల ఈ జుట్టు సమస్య తీరుతుందని చెబుతున్నారు.

జుట్టు సమస్యలు తొలగిపోవాలంటే..బి12 విటమిన్ లోపం లేకుండా చూసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. బి12 లోపం వల్లే వెంట్రుకలు రాలడం, విరగడం, జుట్టు నెరసిపోవడం కూడా జరుగుతుంది. అందువల్ల పాలు, పెరుగు, జున్ను, సోయాబీన్, బ్రోకలీ, పుట్టగొడుగులను తినడం ప్రారంభించాలి. ఇవే దానికి మంచి మూలాధారాలు.  అయితే మనం తినే ఆహారంలో విటమిన్ – డి, బి 12 సమృద్ధిగా ఉన్న ఆహారాన్ని తినడం వల్ల జుట్టుకు పోషకాలు అందించవచ్చు. అలాంటి డైట్ ను రోజూ ఫాలో అవ్వడం వల్ల తెల్ల జుట్టు సమస్యను నివారించుకోవచ్చు.

ఐరన్ లోపం కూడా జుట్టు ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది. అటువంటి పరిస్థితిలో, మీరు తప్పనిసరిగా ఆహారంలో దానిమ్మ, మెంతులు, ఆవాలు, ఉసిరి, బతువా, కొత్తిమీర, పుదీనా, టర్నిప్ మరియు బీట్‌రూట్ తినాలి. వాటిలో ఇనుము పుష్కలంగా లభిస్తుంది.

ఇవి కూడా చదవండి

మీ జుట్టు ఎప్పుడూ నల్లగా, మెరిసేలా ఉండాలని మీరు కోరుకుంటే, మీ శరీరానికి చాలా ప్రోటీన్ న్యూట్రిషన్ ఇవ్వండి. దీంతో జుట్టు ఎప్పటికీ తెల్లబడదు. దీని కోసం, మీరు మీ ఆహారంలో మాంసం, గుడ్డు, చేపలు, పాల ఉత్పత్తులు, పండ్లు, కూరగాయలు, నట్స్, డ్రై ఫ్రూట్‌లను చేర్చుకోవాలి. ఇది మీ జుట్టులో ప్రోటీన్ లోపాన్ని భర్తీ చేస్తుంది.

ఉడికించిన గుడ్లలో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. జుట్టును మెరుగుపరచడం సహా తెల్ల జుట్టు సమస్యను నివారించుకునేందుకు ఆహారంలో ఉడికించిన గుడ్లును తినడం తప్పనిసరి చేసుకోవాలి. పెరుగులో విటమిన్ – బి12 పుష్కలంగా ఉంటుంది. ఇది జుట్టు నల్లగా ఉంచడంలో మేలు చేస్తుంది.

మెలనిన్ అనే మూలకం లేకపోవడం వల్ల జుట్టు త్వరగా తెల్లబడుతుంది. అందుకే మెలనిన్‌ను కలిగి ఉండే ఆహార పదార్థాలను తీసుకోవాలి. మెంతులు, మెంతికూరలో ఐరన్, ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జుట్టులో మెలనిన్ అనే మూలకాన్ని పెంచే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి