AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: పెట్రోల్‌ బంకులో బీభత్సం.. ధైర్యం ప్రదర్శించిన మహిళా ఉద్యోగి.. కానీ, వీడియో చూశారంటే పొట్టచెక్కలే!

సాధారణంగానే పెట్రోల్‌ బంకుల వద్ద పొగత్రాగరాదు, మొబైల్ ఉపయోగించవద్దు అనే బోర్డులు లేదంటే స్టిక్కర్‌లను మీరు తరచుగా చూసే ఉంటారు. ఎందుకంటే పెట్రోల్ పంపు వద్ద అగ్ని ప్రమాదాలు జరగకుండా కంట్రోల్‌ చేసేందుకు. ఇందుకోసం ..

Viral Video: పెట్రోల్‌ బంకులో బీభత్సం.. ధైర్యం ప్రదర్శించిన మహిళా ఉద్యోగి.. కానీ, వీడియో చూశారంటే పొట్టచెక్కలే!
Car
Jyothi Gadda
|

Updated on: Jun 20, 2022 | 5:45 PM

Share

ఒక్కోసారి మన కళ్లే మనల్ని మోసం చేస్తుంటాయి. ఎందుకంటే, కొన్నింటిని చూసి కన్ఫ్యూజన్ అవుతుంటాం..చాలా సార్లు కొన్ని గందరగోళంలో కూడా పడుతుంటాం.. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇలాంటి వీడియో ఒకటి వైరల్‌ అవుతోంది. ఓ పెట్రోల్‌ బంక్‌ సిబ్బంది కన్ఫ్యూజన్ కారణంగా ఏం జరిగిందో వీడియోలో స్పష్టంగా తెలుస్తోంది. వీడియో చూసిన నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు.

సాధారణంగానే పెట్రోల్‌ బంకుల వద్ద పొగత్రాగరాదు, మొబైల్ ఉపయోగించవద్దు అనే బోర్డులు లేదంటే స్టిక్కర్‌లను మీరు తరచుగా చూసే ఉంటారు. ఎందుకంటే పెట్రోల్ పంపు వద్ద అగ్ని ప్రమాదాలు జరగకుండా కంట్రోల్‌ చేసేందుకు. ఇందుకోసం అక్కడ ఉన్న ఉద్యోగులు ఎలాంటి నిబంధనలు ఉల్లంఘించకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. దీనితో పాటు అక్కడ కూడా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తారు. అయితే ఇటీవల పెట్రోల్ పంప్ వద్ద భద్రత విషయంలో మహిళా ఉద్యోగి చేసిన గందరగోళం అందరినీ ఒక్క నిమిషం భయంతో పరుగులు తీసేలా చేసింది. తరువాత ఏం జరిగిందో చూసిన నెటిజన్లు కడుపుబ్బా నవ్వుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి

వైరల్ అవుతున్న ఈ వీడియోలో, మొదట పెట్రోల్ పంపు వద్ద నిలబడి ఉన్న వ్యక్తి తన బైక్‌లో పెట్రోల్ కొట్టిస్తున్నాడు. అప్పుడే తెల్లటి రంగు కారు వచ్చి వెనుక నుండి ఆగింది. ఈ క్రమంలో పెట్రోల్‌ బంకులో పనిచేస్తున్న ఓ మహిళా ఉద్యోగి ఒకరు హడావుడి చేశారు. ఆమె చేసిన కంగారు, గందరగోళంతో ఒక్క నిమిషం అందరికీ ఊపిరి ఆగిపోయినంత పనైంది. వాస్తవానికి అక్కడ ఏం జరిగిందంటే…బంకులోకి వచ్చిన ఓ కారు కింద నుండి లైట్‌ వెలుతురు చాలా ఎక్కువగా పడుతోంది. అది చూసిన బంకులో పనిచేసే మహిళ ఉద్యోగిని మంటలని భయపడిపోయింది. వెంటనే దానిని ఆర్పడానికి వేగంగా మంటలను ఆర్పే పరికరాలను పిచికారీ చేయడం ప్రారంభించింది. ఇదంతా చూసిన స్థానికులు మంటలంటుకున్నాయని భయపడిపోయారు. అంతా ఉరుకులు పరుగులు తీస్తూ ఆ ప్రాంతమంతా టెన్షన్‌ టెన్షన్‌ తో తీవ్ర గందరగోళం నెలకొంది. అంతేకాదు, చుట్టుపక్కల కార్లలో ఉన్న వ్యక్తులు సైతం బయటకు పరుగులు తీశారు.

వైరల్‌ అవుతున్న వీడియోలో, కారులో ఉన్న వ్యక్తులు కూడా కారును విడిచి పారపోయినట్టు చూడొచ్చు. కానీ, సదరు లేడీ ఉద్యోగి మాత్రం ధైర్యం ప్రదర్శిస్తున్నారు. వీడియోలో, మహిళా ఉద్యోగులు కారు లైట్ల వద్ద ఒకరి తర్వాత ఒకరు ఫైర్‌ సెఫ్టీ పరికరాన్ని ప్రయోగించి మంటలార్పే పని చేస్తున్నారు. అయితే, అంతలోనే ఆ కారులో ఉన్న డ్రైవర్‌ వాళ్లు ఏం చేస్తున్నారో అర్థం కాక, తన కారును వెనక్కి తిప్పుకున్నాడు. ఆ తర్వాత ప్రకాశవంతమైన ఆ లైట్‌ను ఆపేశాడు. అయితే, ఆ మహిళా ఉద్యోగులు తామే మంటలు ఆర్పివేశామని భావిస్తున్నారు. ఆ తర్వాత జరిగింది అర్థం చేసుకుని వారు కూడా బిత్తరపోయారు. ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయబడింది. వీడియో చూసిన నెటిజన్లు భిన్నమైన కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియోకు ఇప్పటివరకు 3.1 మిలియన్లకు పైగా వీక్షణలు వచ్చాయి.

View this post on Instagram

A post shared by memes | comedy (@ghantaa)

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి