AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒకే ఇంట్లో తొమ్మిది మృతదేహలు.. పోలీసుల దర్యాప్తులో షాకింగ్ నిజాలు..!

మహారాష్ట్రలోని సాంగ్లీలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఒకే ఇంట్లో మృత‌దేహాల క‌ల‌క‌లం చోటుచేసుకుంది. సాంగ్లీ ప్రాంతంలోని అంబికానగర్‌లో అనుమానాస్పద స్థితిలో ఒకే కుటుంబానికి చెందిన 9 మంది మృతదేహాలు లభ్యమయ్యాయి.

ఒకే ఇంట్లో తొమ్మిది మృతదేహలు.. పోలీసుల దర్యాప్తులో షాకింగ్ నిజాలు..!
mother suicide
Jyothi Gadda
|

Updated on: Jun 20, 2022 | 4:27 PM

Share

మహారాష్ట్రలోని సాంగ్లీలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఒకే ఇంట్లో మృత‌దేహాల క‌ల‌క‌లం చోటుచేసుకుంది. సాంగ్లీ ప్రాంతంలోని అంబికానగర్‌లో అనుమానాస్పద స్థితిలో ఒకే కుటుంబానికి చెందిన 9 మంది మృతదేహాలు లభ్యమయ్యాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం కుటుంబ సభ్యులంతా విషం తాగి మృతి చెందారు. జరిగిన ఘటనతో ఆ ప్రాంతమంతా భయాందోళన పరిస్థితులు నెలకొన్నాయి. అయితే పోలీసులు ఈ ఘ‌ట‌న‌ను ఆత్మహ‌త్యగా అనుమానిస్తన్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఆదివారం రాత్రి అంబికానగర్‌లో విషం సేవించి ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మానిక్ వాన్‌మోర్, పోపట్ వాన్‌మోర్ అనే ఇద్దరు సోదరులు వారి కుటుంబ సభ్యులు సహా ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిపారు. మృతుల్లో తల్లి, భార్య, పిల్లలు ఉన్నారు. సోమవారం ఉదయం మృతదేహాలు లభ్యం కావడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. ఆత్మహత్య చేసుకున్న వారి పేర్లు పోపట్ యల్లప్ప వాన్‌మోర్ (వయస్సు 52), సంగీతా పోపట్ వాన్‌మోర్ (48), అర్చన పోపట్ వాన్‌మోర్ (30), శుభమ్ పోపట్ వాన్‌మోర్ (28), మానిక్ యల్లప్ప వాన్‌మోర్ (49), రేఖ మానిక్ వాన్‌మోర్ (45), ఆదిత్య మానిక్ వాన్మోర్ (15), అనితా మానిక్ వాన్మోర్ (28), అక్కాటై వాన్మోర్ (72). స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు. కుటుంబీకులంతా ఆత్మహత్య చేసుకున్నట్టుగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ తొమ్మిది మృత‌దేహాలు బ‌య‌ట‌ప‌డిన ఘ‌ట‌న‌కు సంబంధించిన పూర్తి స‌మాచారం తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రైం వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!