వ్యవసాయబావిలో పడ్డ చిరుత.. ఫారెస్ట్‌ అధికారుల రెస్క్యూ.. వైరలవుతున్న వీడియో

సోషల్ మీడియాలో చాలా ప్రమాదకరమైన వీడియోలు తరచుగా కనిపిస్తాయి. ప్రస్తుతం వన్యప్రాణులకు సంబంధిచిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాంటి వీడియోలు ఎక్కువగా

వ్యవసాయబావిలో పడ్డ చిరుత.. ఫారెస్ట్‌ అధికారుల రెస్క్యూ.. వైరలవుతున్న వీడియో
Leopard
Follow us

|

Updated on: Jun 20, 2022 | 3:04 PM

సోషల్ మీడియాలో చాలా ప్రమాదకరమైన వీడియోలు తరచుగా కనిపిస్తాయి. ప్రస్తుతం వన్యప్రాణులకు సంబంధిచిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాంటి వీడియోలు ఎక్కువగా నెటిజన్లు ఆశ్చర్యపోయేలా, షాక్‌కు గురయ్యేలా చేస్తుంటాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఆ వీడియోలో కొందరు వ్యక్తులు భయంకరమైన జంతువును రక్షించడం కనిపించింది.

వాస్తవానికి పెరిగిపోయిన జనాభా కారణంగా అడవులు అంతరించిపోతున్నాయి. నిర్మాణాలు అటవీ ప్రాంతాలకు విస్తరిస్తున్నాయి. దీంతో అటవీ జంతువులు తరచూ జనావాసాల్లోకి వస్తూ ప్రమాదాల బారినపడుతున్నాయి. వైరల్ అవుతున్న ఈ వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత్ నందా షేర్ చేశారు. వీడియోలో మహారాష్ట్రలోని ఒక గ్రామంలో బావిలో పడిన చిరుతపులిని రక్షించడం కనిపిస్తుంది. ప్రమాదవశాత్తు ఆహారం వెతుక్కుంటూ మానవ నివాసానికి అతి సమీపంలోకి చేరుకోవడంతో చిరుతపులి బావిలో పడిపోవడం వీడియోలో చూడవచ్చు. బావిలో పడిన చిరుతను కాపాడేందుకు గ్రామస్తులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ సిబ్బంది చిరుతను కాపాడే ప్రయత్నం చేశారు. బావిలోపలికి బోను వేసి చిరుతను బంధించారు. వీడియోలో అటవీ శాఖ అధికారులు చిరుతపులిని బోనులో బంధించిన తర్వాత బోను పైకి లాగడం కనిపిస్తుంది. బావిలోపడ్డ చిరుత మగ చిరుతగా గుర్తించారు.

బోనులో నుండి బయటకు రావడానికి ప్రయత్నిస్తున్న చిరుతపులి భయంకరమైన రూపం వీడియోలో కనిపిస్తుంది. ప్రజలపై దాడి చేయడానికి ఎంత ఆగ్రహంతో ఊగిపోతుందో ఆ వీడియోలో మనం చూడొచ్చు. ఈ వీడియో సోషల్ మీడియాలో మరింత వైరల్ అవుతున్నట్లు తెలుస్తోంది. వార్తలు రాసే సమయానికి, ఈ వీడియోకు 18 వేలకు పైగా వీక్షణలు వచ్చాయి, అయితే వేలాది మంది వినియోగదారులు ఈ వీడియోపై తమ స్పందనను తెలియజేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి