Cable Car Accident: కేబుల్ కార్‌లో సాంకేతిక లోపం.. గాలిలో చిక్కుకున్న పర్యాటకులు.. షాకింగ్ వీడియో వైరల్
టింబర్ ట్రైల్‌లో (Trimbar trail) సాంకేతిక సమస్యతో కేబుల్ కారు చిక్కుకుపోయింది. ట్రిమ్‌బార్ ట్రయిల్ రోప్‌వేపై ఎనిమిది మంది వ్యక్తులు క్యాబర్ కారులో చిక్కుకున్నట్లు తెలుస్తోంది.
Cable Car Accident: హిమాచల్ ప్రదేశ్‌లో (Himachal) ఓ కేబుల్ కారు చిక్కుకుపోయింది. పర్వానూ టింబర్ ట్రైల్ వద్ద సోమవారం 11 మంది పర్యాటకులతో వెళ్తున్న కేబుల్ కారు సాంకేతిక లోపం కారణంగా గాలి మధ్యలో నిలిచిపోయింది. ప్రస్తుతం ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది. కేబుల్ కారులో చిక్కుకున్నవారిని కాపాడేందుకు చేపట్టిన చర్యలకు అందరిని షాక్ కు గురిచేస్తున్నాయి.
సోలన్ జిల్లా ఎస్పీ ప్రకారం.. చిక్కుకుపోయిన పర్యాటకులను రక్షించడానికి మరో కేబుల్ కారుతో సహాయక చర్యలు చేపట్టారు. టింబర్ ట్రైల్ ఆపరేటర్ టెక్నికల్ టీమ్ సాంకేతిక సమస్యను పరిష్కరించేందుకు యత్నిస్తున్నారు. స్థానిక పోలీసులు సహాయకచర్యలను పర్యవేక్షిస్తున్నారు
“కేబుల్ కార్ సిస్టమ్‌లో సాంకేతిక లోపం కారణంగా గత కొన్ని గంటలుగా ఇద్దరు సీనియర్ సిటిజన్లు, నలుగురు మహిళలతో సహా 11 మంది కేబుల్ కార్ ట్రాలీలో చిక్కుకున్నారు. రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోందనిఅధికారులు చెప్పారు. అధికారులు అందించిన సమాచారం ప్రకారం ఇప్పటివరకు తొమ్మిది మంది పర్యాటకులను రక్షించగా.. ,మరో ఇద్దరినీ రక్షించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒంటరిగా ఉన్న పర్యాటకులు… కేబుల్ కారులో చిక్కుకున్న వ్యక్తులను గాలి మధ్యలో నిలిపివేసినట్లు చూపిస్తోంది. అయితే కేబుల్ కారులో చిక్కున్న పర్యాటకులు.. తాము సహాయం కోసం విజ్ఞప్తి చేసినా.. గంటకు పైగా కేబుల్‌కార్‌లో ఇరుక్కుపోయినా.. తమను రక్షించలేదని వీడియోలో పేర్కొన్నారు.
హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్ ట్విటర్‌లో చిక్కుకుపోయిన పర్యాటకులందరినీ సురక్షితంగా కాపాడుతామని హామీ ఇచ్చారు. “సోలన్‌లోని పర్వానూ టింబర్ ట్రైల్‌లో చిక్కుకున్న పర్యాటకుల రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఘటనపై సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి బయలుదేరినట్లు ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్ పేర్కొన్నారు. అధికారులు, NDRF సిబ్బంది సహాయంతో.. ప్రయాణీకులందరినీ త్వరలో సురక్షితంగా రక్షిస్తామని ”అని సిఎం ఒక ట్వీట్‌లో తెలిపారు.
చండీగఢ్ నుండి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న టింబర్ ట్రైల్ ప్రైవేట్ రిసార్ట్‌లో రోప్‌వే రైడ్ ఒక ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణ ప్రాంతం. పర్వానూ హిమాచల్ శిఖరం వద్ద హర్యానా, పంజాబ్ , చండీగఢ్ చుట్టూ ఉన్నందున ఈ రిసార్ట్ ప్రధానంగా ఈ ప్రాంతం పర్యాటకులను ఆకర్షిస్తుంది.
#HimachalPradesh :- Eleven People are stucked in the Timber Trail due to techanical problem. They have been getting rescued by the management.#Himachal pic.twitter.com/EgMfJy0UPY
— Gorish (@IGorishThakur) June 20, 2022
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..