స్పైస్‌ జెట్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. ఫ్లైట్‌లో 185 మంది ప్రయాణికులు

స్పైస్‌జెట్ విమానం అత్యవసర ల్యాండింగ్ చేయబడింది. విమానంలో మంటలు చెలరేగడంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ చేసినట్లు సమాచారం. ఈ విమానంలో 185 మంది ఉన్నారు. ఇప్పటి వరకు వచ్చిన నివేదిక ప్రకారం...

స్పైస్‌ జెట్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. ఫ్లైట్‌లో 185 మంది ప్రయాణికులు
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 19, 2022 | 1:36 PM

స్పైస్‌జెట్ విమానం అత్యవసర ల్యాండింగ్ చేయబడింది. విమానంలో మంటలు చెలరేగడంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ చేసినట్లు సమాచారం. బీహార్‌లోని పాట్నా ఎయిర్‌పోర్టులో ఈ ఘటన చోటు చేసుకుంది. ఢిల్లీ వెళ్లే ఈ విమానాన్ని పాట్నా విమానాశ్రయంలో ల్యాండ్ చేశారు. ఈ విమానంలో 185 మంది ఉన్నారు. ఇప్పటి వరకు వచ్చిన నివేదిక ప్రకారం. విమానంలోని ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే…

స్పైస్ జెట్ విమానంలో సాంకేతిక లోపం కారణంగా మంటలు చెలరేగటం గమనించిన సిబ్బంది చాకచక్యంగా వ్యవహించారు. ఘటన చోటు చేసుకున్న వెంటనే వెంటనే విమానాశ్రయ యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రయాణికులందరినీ సురక్షితంగా బయటికి తరలించినట్లు అధికారులు తెలిపారు. సమాచారం ప్రకారం విమానం టేకాఫ్ అవుతుండగా ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. అగ్నిమాపక దళం, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. నివేదిక ప్రకారం, ఈ విమానం పాట్నాలోని జైప్రకాష్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి 12.10 గంటలకు బయలుదేరింది. టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలకే ఈ విమానం ఫ్యాన్‌లో మంటలు చెలరేగాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఈ విమానం ఫ్యాన్‌లో మంటలు ఎగిసిపడడాన్ని ప్రజలు కింది నుంచి చూశారు. విమానం ఫ్యాన్ నుంచి మంటలు రావడాన్ని ప్రజలు గమనించారు. ఈ ఘటనపై ప్రజలు వెంటనే పాట్నా పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం ఘటనపై విమానాశ్రయానికి సమాచారం అందించారు. ఆ తర్వాత ఈ విమానాన్ని వెనక్కి తీసుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?
ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!