AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సికింద్రాబాద్ హింసాకాండ సూత్రధారి అరెస్ట్.. పోలీసుల అదుపులో మరో 200 మంది విద్యార్థులు !

సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ దాడి పై ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఇప్పటికే 52 మంది విద్యార్థులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు పోలీసులు. ఏడుగురు అనుమానితులను విచారిస్తున్న రైల్వే పొలీసులు.. దాడిలో పాల్గొన్న

సికింద్రాబాద్ హింసాకాండ సూత్రధారి అరెస్ట్..  పోలీసుల అదుపులో మరో 200 మంది విద్యార్థులు !
Secunderabad Riots
Jyothi Gadda
|

Updated on: Jun 19, 2022 | 11:23 AM

Share

Agnipath protest: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ దాడి పై ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఇప్పటికే 52 మంది విద్యార్థులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు పోలీసులు. ఏడుగురు అనుమానితులను విచారిస్తున్న రైల్వే పొలీసులు.. దాడిలో పాల్గొన్న వారికోసం గాలిస్తున్నారు పోలీసులు. సీసీ కెమెరా, పోలీస్ వీడియో రికార్డింగ్, మీడియా ఫుటేజ్, సోషల్ మీడియా, సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా మరికొంత మంది అభ్యర్థలను గుర్తించే పనిలో పోలీసులున్నారు. రైల్వే యాక్ట్ లో ఒక్కసారి కేసులు నమోదైతే మాఫీలు ఉండవని పేర్కొన్నారు పోలీసులు. అల్లర్ల వెనక ఉన్న ప్రైవేటు డిఫెన్స్ అకాడమీ యాజమాన్యాల కుట్ర ఉందని కోణంలో పోలీసుల విచారణ జరుగుతోంది. ఇప్పటికే కీలక నిందితుడు ఆవుల సుబ్బారావు‌ను అరెస్టు చేశారు.

పల్నాడు జిల్లా నర్సరావుపేట రూరల్ సీఐ భక్తవత్సలరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..నర్సరావుపేట రూరల్ పరిధిలో సాయి డిఫెన్స్ అకాడమీ ఉంది. అగ్నిపథ్ ఆందోళనల‌ నేపధ్యంలో అకాడమీ డైరెక్టర్ సుబ్బారావును విచారిస్తున్నట్లు తెలిపారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ విధ్వంసం ఘటనలో సుబ్బారావు పాత్ర ఉందని సోషల్ మీడియాలో కథనాలు వచ్చాయి. ఎస్పీ ఆదేశాల మేరకు సుబ్బారావు పాత్ర ఉందా.. లేదా అనేది విచారిస్తున్నామని తెలిపారు. ఆందోళన జరిగిన సమయంలో తాను‌ అక్కడ లేనని‌ సుబ్బారావు చెప్పారు. టెక్నికల్ ఎవిడెన్స్ ఏమీ లభించలేదన్నారు. సెల్ ఫోన్ లో స్టూడెంట్స్ కు అకాడమీ గురించి సుబ్బారావు మెసేజ్ లు పంపించాడు. అందులో నెగిటివ్ మెసేజ్ లు ఉన్నాయేమోనని పరిశీలిస్తున్నామన్నారు. ఇప్పటివరకూ అకామీలో శిక్షణ పొందిన రెండు వేలమందికి ఉద్యోగాలు ఇప్పించినట్లు సుబ్బారావు చెబుతున్నాడు. సుబ్బారావు ద్వారా అగ్నిపథ్ ఆందోళనలకు వెళ్లకుండా అకాడమీ స్టూడెంట్స్ కి చెప్పిస్తున్నాం. సుబ్బారావును అబ్జర్వేషన్ లో ఉంచాం… విచారించడానికి మాత్రమే పిలిచాం. అకాడమీలో ఎంతమందికి స్టూడెంట్స్ ఉన్నారు… ఎంతమందికి అకామిడేషన్ ఇస్తున్నారో వివరాలు తెలుసుకున్నట్లు తెలిపారు. ఇప్పటివరకూ తెలంగాణ పోలీసులు మమ్మల్ని సంప్రదించలేదని చెప్పారు. ఇదిలా ఉంటే, నర్సరావుపేట పోలీసుల అదుపులోనే ఉన్నారు సాయి డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ ఆవుల సుబ్బారావు. పోలీసులు సుబ్బారావును విచారిస్తున్నారు. కానీ, సుబ్బారావు అరెస్టును ధృవీకరించలేదు పోలీసులు.

సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో జరిగిన హింసాత్మక ఘటనలో వరంగల్‌కు చెందిన 19 ఏళ్ల రాజేష్ చనిపోయాడు. కాగా పదుల సంఖ్యలో ఆందోళనకారులు గాయపడ్డారు. శుక్రవారం రైల్వే స్టేషన్‌లో వేలాది మంది ఆందోళనకారులు గుమిగూడి మూడు ప్యాసింజర్ రైళ్లపై దాడి చేయడంతో ఈ ఘటన జరిగింది. ఈ సందర్భంగా ఆందోళనకారులు రైలు బోగీలను తగులబెట్టి ప్రజా ఆస్తులను ధ్వంసం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా హింసాత్మక ఘటనలకు సంబంధించి పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్‌లో నాలుగేళ్లపాటు స్వల్పకాలిక కాంట్రాక్టు ప్రాతిపదికన సైనికులను రిక్రూట్ చేసుకునేందుకు ‘అగ్నీపథ్’ పథకాన్ని ప్రభుత్వం మంగళవారం ఆవిష్కరించిన తర్వాత పలు రాష్ట్రాల్లో ఆందోళనలు చెలరేగాయి. ఈ పథకం కింద, 17.5 సంవత్సరాల నుండి 23 సంవత్సరాల వయస్సు గల వ్యక్తులు నాలుగు సంవత్సరాల పదవీకాలానికి సేవల్లోకి చేర్చబడతారు. ఈ కాలంలో, వారికి ₹ 30,000-40,000 మధ్య నెలవారీ జీతం, అలవెన్సులు చెల్లించబడతాయి, ఆ తర్వాత గ్రాట్యుటీ, పెన్షన్ లేకుండా చాలా మందికి తప్పనిసరి పదవీ విరమణ ఉంటుంది.

Follow Us