Swachh Bharat: చెత్త తీసిన మోదీ.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో..

స్వచ్చభారత్ మిషన్‌కు కట్టుబడి ఉన్న ప్రధానమంత్రి ఆదివారం ఢిల్లీలోని ప్రగతి మైదాన్ ఇంటిగ్రేటెడ్ ట్రాన్సిట్ కారిడార్‌లో భాగంగా కొత్తగా ప్రారంభించిన భూగర్భ సొరంగంలో చెత్తను సేకరిస్తూ కనిపించారు.

Swachh Bharat: చెత్త తీసిన మోదీ.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో..
Pm Narendra Modi
Follow us
Rajitha Chanti

|

Updated on: Jun 19, 2022 | 1:50 PM

దేశంలోని అన్ని నగరాలను చెత్త రహితంగా మార్చడమే తమ ప్రభుత్వం లక్ష్యమని ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి తన చర్యలతో చెప్పకనే చెప్పారు. స్వచ్చభారత్ మిషన్‌కు కట్టుబడి ఉన్న ప్రధానమంత్రి ఆదివారం ఢిల్లీలోని ప్రగతి మైదాన్ ఇంటిగ్రేటెడ్ ట్రాన్సిట్ కారిడార్‌లో భాగంగా కొత్తగా ప్రారంభించిన భూగర్భ సొరంగంలో చెత్తను సేకరిస్తూ కనిపించారు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రముఖ వార్తా సంస్థ ఏఎన్ఐ ట్వీట్ చేసిన వీడియో ప్రకారం.. ప్రధాని మోదీ కొత్తగా ప్రారంభించిన ప్రధాన సొరంగం అంతటిని పరిశీలిస్తూ.. అక్కడ పడి ఉన్న ఖాళీ వాటర్ బాటిల్, ఇతర చెత్త పదార్ధాలను సేకరిస్తున్నట్లుగా మీరు చూడవచ్చు.

కాగా, ప్రగతి మైదాన్ పునరాభివృద్ధిలో భాగంగా ఇంటిగ్రేటెడ్ ట్రాన్సిట్ కారిడార్ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్రధాన టన్నల్, ఐదు అండర్‌పాస్‌లను ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ప్రారంభించారు. 1.6 కిలోమీటర్ల పొడవైన ఈ సొరంగం గుండా తూర్పు ఢిల్లీ, నోయిడా, ఘజియాబాద్ నుంచి ఇండియా గేట్, ఇతర సెంట్రల్ ఢిల్లీ ప్రాంతాలకు ప్రజలు సులభంగా ప్రయాణించవచ్చు. అంతేకాకుండా దీనితో ఇకపై ITO, మథుర రోడ్, భైరాన్ మార్గ్‌ల వద్ద ట్రాఫిక్ కష్టాలకు స్వస్తి పలికినట్లేనని చెప్పవచ్చు. ఈ కారిడార్ ప్రాజెక్ట్‌ను కేంద్ర ప్రభుత్వం రూ.920 కోట్లకు పైగా వ్యయంతో నిర్మించింది.

ఇవి కూడా చదవండి

మరిన్నినేషనల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.