Adivi Sesh: నెటిజన్ ట్వీట్‎కు అదిరిపోయే రిప్లై ఇచ్చిన అడివి శేష్.. అసలు విషయం ఏంటంటే ?..

డైరెక్టర్ శశికిరణ్ తిక్క రూపొందించిన ఈ మూవీ జూన్ 3న విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఉత్తరాదిలోనూ ఈ సినిమా వసూళ్లు రాబడుతుంది.

Adivi Sesh: నెటిజన్ ట్వీట్‎కు అదిరిపోయే రిప్లై ఇచ్చిన అడివి శేష్.. అసలు విషయం ఏంటంటే ?..
Adivi Sesh
Follow us
Rajitha Chanti

|

Updated on: Jun 19, 2022 | 7:27 AM

మేజర్ సినిమాతో పాన్ ఇండియా లెవల్లో ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు యంగ్ హీరో అడివి శేష్ (Adivi Sesh). 26/11 ముంబై దాడులలో ప్రాణ త్యాగం చేసిన మేజర్ (Major) సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కించిన ఈ సినిమాకు దేశవ్యాప్తంగా మంచి రెస్పాన్స్ వస్తోంది. డైరెక్టర్ శశికిరణ్ తిక్క రూపొందించిన ఈ మూవీ జూన్ 3న విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఉత్తరాదిలోనూ ఈ సినిమా వసూళ్లు రాబడుతుంది. ఇక ఇప్పటికే మేజర్ సినిమాపై సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. మేజర్ సందీప్ పాత్రలో అడివి శేష్ ఒదిగిపోయాడంటూ పొగడ్తలు కురిపించారు. తాజాగా నెటిజన్ అడిగిన ఓ సందేహానికి అడివి శేష్ తనదైన శైలీలో రిప్లై ఇచ్చాడు. ప్రస్తుతం వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణ నెట్టింట వైరల్ అవుతుంది.

“నేను కమల్ సర్‏కు గొప్ప అభిమానిని.. కానీ ఈరోజు నన్ను అడిగితే విక్రమ్, మేజర్ సినిమాలలో ఏది చూడాలంటే.. ముందు మేజర్ చూస్తాను.. ఆ తర్వాత విక్రమ్ చూస్తాను ” అంటూ ట్వీట్ చేశాడు.. దీనిపై అడివి శేష్ స్పందించాడు.. నేను కూడా కమల్ హాసన్ గారికి పెద్ద ఫ్యాన్.. రెండు సినిమాలు చూడండి అంటూ చెప్పుకొచ్చాడు అడివి శేష్. మరోవైపు కమల్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన విక్రమ్ సినిమా సైతం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. ఇందులో విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్, సూర్య కీలకపాత్రలలో నటించారు. ఒకేరోజు విడుదలైన విక్రమ్, మేజర్ చిత్రాలు సూపర్ హిట్ కావడమే కాకుండా మంచి వసూళ్లు రాబడుతున్నాయి.

ట్వీట్..

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

గంభీర్ మద్దతుతో హర్షిత్ రాణా ఎంపిక!
గంభీర్ మద్దతుతో హర్షిత్ రాణా ఎంపిక!
అస్సలు తగ్గేదే లే అంటోన్న మిస్టర్ సైలెన్సర్..
అస్సలు తగ్గేదే లే అంటోన్న మిస్టర్ సైలెన్సర్..
రాత్రివేళ కొండ పై నుంచి దూకిన యువతి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..
రాత్రివేళ కొండ పై నుంచి దూకిన యువతి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..
పిజ్జా, బర్గర్లు తెగ లాగించేస్తున్నారా? ఆగండాగండి ఇది తెలుసుకోండి
పిజ్జా, బర్గర్లు తెగ లాగించేస్తున్నారా? ఆగండాగండి ఇది తెలుసుకోండి
ఈ ప్రాంతాల్లో కుండపోత వానలు.. 3 రోజుల వెదర్ రిపోర్ట్ ఇదే..
ఈ ప్రాంతాల్లో కుండపోత వానలు.. 3 రోజుల వెదర్ రిపోర్ట్ ఇదే..
సిబిల్ స్కోర్ నిబంధనలలో మార్పు.. ఆర్బీఐ యాక్షన్ ఆర్డర్!
సిబిల్ స్కోర్ నిబంధనలలో మార్పు.. ఆర్బీఐ యాక్షన్ ఆర్డర్!
ఈ సమస్యలు ఉన్న వారు అరటిపండును అస్సలు తినకూడదంట.. ఎందుకంటే..
ఈ సమస్యలు ఉన్న వారు అరటిపండును అస్సలు తినకూడదంట.. ఎందుకంటే..
వీకెండ్‌లో మాత్రమే మందేసే వారికి షాకింగ్‌ న్యూస్‌.. ఈ ఫొటో చూడండి
వీకెండ్‌లో మాత్రమే మందేసే వారికి షాకింగ్‌ న్యూస్‌.. ఈ ఫొటో చూడండి
ఫోన్ వాడకం తగ్గించేందుకు వింత పోటీ.. లక్షలు గెలుచుకున్న యువతి
ఫోన్ వాడకం తగ్గించేందుకు వింత పోటీ.. లక్షలు గెలుచుకున్న యువతి
ఆడుకుంటానంటే అమ్మాయికి ఫోన్‌‌ ఇచ్చింది.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..
ఆడుకుంటానంటే అమ్మాయికి ఫోన్‌‌ ఇచ్చింది.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..