Anya’s Tutorial: అన్యా’స్ ట్యుటోరియల్ ట్రైలర్‏కు అనుహ్య స్పందన.. స్ట్రీమింగ్ ఎప్పుడు ఎక్కడంటే..

భ‌యానికి మ‌రో రూపం ‘అన్యా’స్ ట్యుటోరియల్’. ఇప్ప‌టి వ‌ర‌కు ఎప్పుడూ ఎక్క‌డా చూడ‌ని ఒక స‌రికొత్త వెబ్ సిరీస్‌తో ఆర్కా మీడియా మ‌నంద‌రి ముందుకు వ‌స్తుంది.

Anya’s Tutorial: అన్యా’స్ ట్యుటోరియల్ ట్రైలర్‏కు అనుహ్య స్పందన.. స్ట్రీమింగ్ ఎప్పుడు ఎక్కడంటే..
Anya's Tutorial
Follow us
Rajitha Chanti

|

Updated on: Jun 19, 2022 | 6:47 AM

రెజీనా కసాండ్ర‌, నివేదితా స‌తీష్ ప్ర‌ధాన పాత్రలలో నటిస్తోన్న లేటేస్ట్ వెబ్ సిరీస్ అన్యా’స్ ట్యుటోరియల్ (Anya’s Tutorial). ఈ సిరీస్ ఆర్కా మీడియా, ఆహా క‌ల‌యిక‌లో రూపొందుతోంది. డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి శనివారం ట్రైలర్ లాంచ్ చేశారు. ఈ 7 ఎపిసోడ్‌ల వెబ్ సిరీస్‌ను జూలై 1 నుంచి ఆహాలో తెలుగు, త‌మిళ భాష‌ల్లో స్ట్రీమ్ కానుంది. భ‌యానికి మ‌రో రూపం ‘అన్యా’స్ ట్యుటోరియల్’. ఇప్ప‌టి వ‌ర‌కు ఎప్పుడూ ఎక్క‌డా చూడ‌ని ఒక స‌రికొత్త వెబ్ సిరీస్‌తో ఆర్కా మీడియా మ‌నంద‌రి ముందుకు వ‌స్తుంది.

ప్ర‌పంచం మొత్తం ఇప్పుడు డిజ‌ట‌ల్ వైపు అడుగులు వేస్తోంది. కానీ అదే డిజిట‌ల్ రంగం అంద‌రినీ భ‌య‌పెడితే .. అదే అన్యాస్ ట్యుటోరియ‌ల్‌. అన్య (నివేదితా స‌తీష్‌) ఒక సోష‌ల్ ఇన్‌ఫ్లూయెన్స‌ర్ కావాల‌ని ప్ర‌య‌త్నిస్తుంది. కానీ మ‌ధు (రెజీనా క‌సాండ్ర‌)కి త‌న చెల్లి అన్య ప్రొఫెష‌న్ న‌చ్చ‌దు. కానీ అనుకోకుండా ఓ రోజు మొత్తం మారిపోతుంది. ఎవ‌రూ చూడ‌ని విధంగా సైబ‌ర్ ప్ర‌ప‌చం మొత్తం భ‌య‌ప‌డుతుంది. అస‌లు ఎందుకు? అది తెలుసుకోవాలంటే అన్యాస్ ట్యుటోరియ‌ల్ చూడాల్సిందే. త‌న అభిమానుల కోసం ఆహా, ఈ వెబ్ సిరీస్‌ను తెలుగు, త‌మిళ భాష‌ల్లో విడుద‌ల చేయ‌బోతున్నారు.

నివేదితా స‌తీష్ మాట్లాడుతూ ‘‘నేను గుంటూరు అమ్మాయిని. ఎప్పుడు తెలుగు లోగిళ్ల‌లో అడుగు పెడ‌తానా అని ఆలోచించాను. ఆ క‌ల ఈరోజు నిజ‌మైంది. ఆర్కా మీడియా, ఆహా సంస్థ‌లు క‌ల‌యిక‌లో వ‌స్తున్న అన్యాస్ ట్యుటోరియ‌ల్ వెబ్ సిరీస్ ద్వారా లాంచ్ అవుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. అలాగే ఈ వెబ్ సిరీస్‌కు నేనే డ‌బ్బింగ్ చెప్పుకున్నాఉ. ఇన్నేళ్ల త‌ర్వాత నా మాతృభాష‌లో అవ‌కాశం వ‌చ్చింది. అంద‌రికీ అన్యాస్ ట్యుటోరియ‌ల్ న‌చ్చుతుంద‌ని, ఆద‌రిస్తార‌ని భావిస్తున్నాను’’ అన్నారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ప్రతి శుక్రవారం ఆమెకు పాము గండం.. ఇప్పటికీ 11సార్లు కాటువేసింది!
ప్రతి శుక్రవారం ఆమెకు పాము గండం.. ఇప్పటికీ 11సార్లు కాటువేసింది!
అమేజింగ్.. అదరహో అనేలా ట్యాంక్‌ బండ్‌పై ఎయిర్‌ షో.. వీడియో
అమేజింగ్.. అదరహో అనేలా ట్యాంక్‌ బండ్‌పై ఎయిర్‌ షో.. వీడియో
నడవలేని స్థితిలో మంచు మనోజ్..
నడవలేని స్థితిలో మంచు మనోజ్..
అసలు వినోద్ కాంబ్లికి ఏమైంది? ఏ వ్యాధితో బాధపడుతున్నాడు?
అసలు వినోద్ కాంబ్లికి ఏమైంది? ఏ వ్యాధితో బాధపడుతున్నాడు?
ఇవి ధాన్యం కాదు.. మధుమేహులకు దివ్యౌషధం..! ఇలా తింటే ఆ సమస్యలన్నీ
ఇవి ధాన్యం కాదు.. మధుమేహులకు దివ్యౌషధం..! ఇలా తింటే ఆ సమస్యలన్నీ
ఓజీ vs హరిహరవీరమల్లు లో పవర్‌స్టార్‌ ఎటు మొగ్గుతారు.? ఇదే ట్రెండ్
ఓజీ vs హరిహరవీరమల్లు లో పవర్‌స్టార్‌ ఎటు మొగ్గుతారు.? ఇదే ట్రెండ్
సింపుల్‏గా గుడిలో పెళ్లి చేసుకున్న స్టార్ నటుడి తనయుడు..
సింపుల్‏గా గుడిలో పెళ్లి చేసుకున్న స్టార్ నటుడి తనయుడు..
EVMల చుట్టూ మహారాష్ట్ర రాజకీయం.. శరద్ పవర్ సంచలన వ్యాఖ్యలు
EVMల చుట్టూ మహారాష్ట్ర రాజకీయం.. శరద్ పవర్ సంచలన వ్యాఖ్యలు
గత పదేళ్లతో పోలిస్తే మా పాలన భేష్‌: పీసీసీ చీఫ్‌ మహేష్‌ గౌడ్
గత పదేళ్లతో పోలిస్తే మా పాలన భేష్‌: పీసీసీ చీఫ్‌ మహేష్‌ గౌడ్
మన రవితేజ పై తమిళ్ ఇండస్ట్రీ కన్ను.! పిలుపు దురంలో మాస్ మహారాజ్..
మన రవితేజ పై తమిళ్ ఇండస్ట్రీ కన్ను.! పిలుపు దురంలో మాస్ మహారాజ్..