Aadi Sai Kumar: డిజిటల్ ఎంట్రీ ఇస్తోన్న ఆది సాయి కుమార్.. ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్‏లో యంగ్ హీరో..

గోపీచంద్ హీరో గా ‘పంతం’ చిత్రానికి దర్శకత్వం వహించిన కె చక్రవర్తి రెడ్డి మెగాఫోన్ పట్టారు. ప్రముఖ రచయిత, నిర్మాత కోన వెంకట్ & జీ5 వారు సంయుక్తంగా ఈ వెబ్ సిరీస్ ని ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు.

Aadi Sai Kumar: డిజిటల్ ఎంట్రీ ఇస్తోన్న ఆది సాయి కుమార్.. ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్‏లో యంగ్ హీరో..
Puli Meka Web Series
Follow us

|

Updated on: Jun 19, 2022 | 10:21 AM

ప్రేమకావాలి సినిమాతో హీరోగా అరంగేట్రం చేసి మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు ఆది సాయి కుమార్. ఆ తర్వాత లవీలీ, సుకుమారుడు వంటి హిట్ చిత్రాల్లో నటించి మెప్పించారు. చాలా కాలంగా ఈ యంగ్ హీరో హిట్టు కోసం ఎదురుచూస్తున్నారు. ఇటీవలే శశి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ ఆశించినంత స్థాయిలో ప్రేక్షకులకు ఆకట్టుకోలేకపోయాడు.. దీంతో తన తదుపరి ప్రాజెక్ట్స్ విషయంలో అచి తూచి వ్యవహరిస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం బ్లాక్, క్రేజీ ఫెల్లో వంటి చిత్రాల్లో నటిస్తున్నాడు… ఇప్పుడు ఈ సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఈ యంగ్ హీరో డిజిటల్ ప్లాట్ ఫాంపై సత్తా చాటేందుకు సిద్దమయ్యారు.. ఆయన ప్రధాన పాత్రలో రాబోతున్న వెబ్ సిరీస్ పులి మేక.. ఇందులో లావణ్య త్రిపాఠి, సుమన్ కీలకపాత్రలలో నటించనున్నారు.

గోపీచంద్ హీరో గా ‘పంతం’ చిత్రానికి దర్శకత్వం వహించిన కె చక్రవర్తి రెడ్డి మెగాఫోన్ పట్టారు. ప్రముఖ రచయిత, నిర్మాత కోన వెంకట్ & జీ5 వారు సంయుక్తంగా ఈ వెబ్ సిరీస్ ని ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. క్రైమ్ థ్రిల్లర్‌ కథాంశం తో తెరకెక్కిస్తున్న ‘పులి – మేక ’ వెబ్ సిరీస్ పూజ కార్యక్ర మాలు హైదరాబాద్ లో ఘనంగా జరుపుకుంది. ఈ పూజా కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా వచ్చిన దర్శకుడు బాబీ క్లాప్ కొట్టగా, దర్శకుడు అనిల్ రావిపూడి కెమెరా స్విచాన్ చేశారు.

పూజ కార్యక్రమాల అనంతరం నిర్మాతలు మాట్లాడుతూ..ఈ మధ్య వెబ్ సిరీస్ లు కూడా సినిమాల తో పోటీ పడుతున్నాయి.మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రస్తుతం ప్రేక్షకులు ఎక్కువగా వెబ్ సిరీస్ లకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దాంతో సినిమా హీరోలు సైతం వెబ్ సిరీస్ లలో నటించడానికి ముందుకు వస్తున్నారు.ఈ పులి – మేక వెబ్ సిరీస్ లలో లావణ్య త్రిపాఠి, ఆది సాయికుమార్, సుమన్ తదితరులు నటిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ “పులి – మేక” వెబ్ సిరీస్ కథ విషయానికి వస్తే పోలీసు డిపార్ట్‌మెంట్ చుట్టూ తిరిగే థ్రిల్లర్ కథ ఇది . పోలీస్ డిపార్టుమెంట్ లోని పోలీసులను టార్గెట్ చేసి ఒకరి తర్వాత ఒకరు చంపుతున్న ఒక సీరియల్ కిల్లర్ నేపథ్యంలో థ్రిల్లర్ అంశాలు మరియు ఆస్ట్రాలజీ తో మిళితమైన కథాంశం ఉండటం ఈ వెబ్ సిరీస్ కథలో ఉన్న ప్రత్యేకత ఇప్పటి వరకు వచ్చిన వెబ్ సిరీస్ లాగే ఇది కూడా అందరికీ కచ్చితంగా నచ్చుతుంది అన్నారు

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??