Venu Udugula: సాయి పల్లవి లేకపోతే ఈ కథే ఉండేది కాదు.. డైరెక్టర్ వేణు ఉడుగుల ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
నక్సలిజం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో వెన్నెల పాత్రలో న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి నటించగా.. నక్సలైట్ రవన్న పాత్రలో రానా దగ్గుబాటి నటించారు.
డైరెక్టర్ వేణు ఉడుగుల (Venu Udugula) తెరకెక్కించిన విరాటపర్వం సినిమా సూపర్ హిట్ టాక్తో దూసుకుపోతుంది. 1990లో సరళ అనే అమ్మాయి నిజ జీవితంలో జరిగిన యధార్ధ సంఘటనలు ఆధారంగా రూపొందించిన ఈ మూవీకి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది (Virata Parvam). నక్సలిజం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో వెన్నెల పాత్రలో న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి నటించగా.. నక్సలైట్ రవన్న పాత్రలో రానా దగ్గుబాటి నటించారు. డి. సురేష్ బాబు సమర్పణలో ఎస్.ఎల్.వి. సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమా జూన్ 17న ప్రపంచవ్యాప్తంగా విడుదలై ఎపిక్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి భారీ ఆదరణ లభిస్తున్న నేపధ్యంలో చిత్ర బృందం మీడియా సమావేశం నిర్వహించింది. ఈ మీడియా సమావేశంలో చిత్ర బృందంతో పాటు.. సరళ అన్నయ్య తూము మోహన్ రావు కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డైరెక్టర్ వేణు ఉడుగుల మాట్లాడుతూ.. ” చిత్రానికి అన్ని ప్రాంతాలు, వర్గాల ప్రేక్షకుల నుండి యునానిమస్ గా బిగ్ హిట్ టాక్ వచ్చింది. పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి. ఈ ప్రాజెక్ట్ విజయవంతం కావడానికి కారణమైన నిర్మాతలు రానా గారు, సుధాకర్ చెరుకూరి గారు, శ్రీకాంత్ గారు, ఒక గాడ్ ఫాదర్ గా మా అందరినీ వెనుకుండి నడిపించిన సురేష్ బాబు గారికి కృతజ్ఞతలు. సాయి పల్లవి గారు లేకపోతే ఈ కథ వుండేది కాదు. ఆమె కు కృతజ్ఞతలు. సంగీత దర్శకుడు సురేష్ బొబ్బిలి అద్భుతమైన సంగీతం అందించారు. ఎమోషనల్ గా మరో స్థాయికి తీసుకెళ్ళారు. 1990 వాతావరణంను క్రియేట్ చేయడంలో అద్భుత ప్రతిభ కనబరిచిన ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర గారికి థాంక్స్. అద్భుతమైన విజువల్స్ ఇచ్చిన డానీ, దివాకర్ మణి కి కృతజ్ఞతలు. మిగతా నటీనటులు, సాంకేతిక నిపుణులందరికీ కృతజ్ఞతలు. సరళ అనే అమ్మాయి జీవితంలో జరిగిన యాదార్ధ సంఘటనలు ఆధారంగా తీసిన చిత్రమిది. సరళ గారి అన్నయ్య తూము మోహన్ రావు గారు ఈ ప్రెస్ మీట్ రావడం కూడా ఆనందంగా వుంది. విరాట పర్వం ని ఇంత పెద్ద విజయం చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. ఇలాంటి మీనింగ్ ఫుల్ సినిమాలు మౌత్ టాక్ ద్వారా నే పబ్లిక్ లోకి వెళతాయి. ఇలాంటి మీనింగ్ ఫుల్ సినిమాని అందరూ ఆదరించాలని ప్రేక్షకులని, మీడియాని కోరుకుంటున్నాను. ఇలాంటి అర్ధవంతమైన సినిమాలని నిలబెడితే మరిన్ని మంచి చిత్రాలు వస్తాయి” అన్నారు.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.