AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

షూటింగ్ సెట్‏లో ప్రమాదం.. పల్టీలు కొట్టిన వ్యాన్ ఇద్దరు నటుల మృతి.. పలువురికి గాయాలు..

తాజాగా అలాంటి ప్రమాదమే మెక్సికోలోని బాజా కాలిఫోర్నియా సుర్ ద్వీపకల్పంలో జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు నటులు చనిపోగా.. ఆరుగురు గాయాల పాలయ్యారు..

షూటింగ్ సెట్‏లో ప్రమాదం.. పల్టీలు కొట్టిన వ్యాన్ ఇద్దరు నటుల మృతి.. పలువురికి గాయాలు..
Actor Died
Rajitha Chanti
|

Updated on: Jun 20, 2022 | 7:11 AM

Share

సినిమా షూటింగ్ సెట్‏లో కొన్ని సందర్భాల్లో ప్రమాదాలు జరుగుతుంటాయి. యాక్షన్ సీన్స్ తెరకెక్కిస్తున్న సమయంలో ప్రమాదాలు జరగడం.. నటీనటులతోపాటు మిగతావారికి గాయాలవుతుంటాయి. అయితే సెట్‏లో జరిగిన ప్రమాదాల్లో ప్రాణాపాయం జరిగకుండా ఉండేందుకు మేకర్స్ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. గతంలో భారతీయుడు 2 సినిమా షూటింగ్ సెట్‏లో జరిగిన ప్రమాదంలో ప్రాణ నష్టం జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా అలాంటి ప్రమాదమే మెక్సికోలోని బాజా కాలిఫోర్నియా సుర్ ద్వీపకల్పంలో జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు నటులు చనిపోగా.. ఆరుగురు గాయాల పాలయ్యారు.. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ ఒరిజినల్ సిరీస్ ది చోసెన్ వన్ తెరకెక్కిస్తుంది. ఇందుకు సంబంధించిన షూటింగ్ బాజా కాలిఫోర్నియా సమీపంలోని శాంటా రోసాలియా ప్రాంతంలో జరుగుతున్నాయి. అయితే అక్కడి ఎడారి ప్రాంతంలో రోడ్డుపై వెళ్తున్న వ్యాన్ పల్టీలు కొడుతూ షూటింగ్ స్పాట్‏లోకి దూసుకెళ్లింది..

ఈ ప్రమాదంలో వ్యాన్ లో ఉన్న ఇద్దరు నటులు మృతి చెందగా..సెట్ లో ఉన్న పలువురు గాయాల పాలయ్యారు.. మరణించిన నటులు రేముండో గుర్డానో, జువాన్ ఫ్రాన్సిస్కో అగ్విలర్ గా గుర్తించారు కాలిఫోర్నియా పోలీసులు. ది హాలీవుడ్ రిపోర్ట్ ప్రకారం ఈ ప్రమాదం జూన్ 16న జరిగినట్లుగా తెలుస్తోంది. గాయపడినవారు ప్రస్తుతం కోలుకుంటున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ ప్రమాదంపై నెట్ ఫ్లిక్స్ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. ది చొసెన్ వన్ అనేది బ్రెజిలియన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. దీనిని 2019లో ప్రారంభించారు.. దీనిని అమెరికన్ జీసస్ ఆధారంగా తెరకెక్కిస్తుంది.. ఇందులో 12 ఏళ్ల బాలుడిగా జీసస్.. మానవజాతిని రక్షఇంచడానికి తిరిగి వచ్చినట్లుగా సిరీస్ తెరకెక్కిస్తున్నట్లుగా తెలుస్తోంది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.