Viral Video: కుక్కపిల్ల చిలిపి పని.. తొలి ముద్దుతో తెగ సంబరపడిపోయి గంతులేసింది.. నవ్వులు పూయిస్తున్న వీడియో..
గంతలేస్తూ ఉక్కిరిబిక్కిరి అవుతూ తన ఆనందాన్ని తెలియజేసింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
ప్రస్తుతం సోషల్ మీడియాలో జంతువులకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. కోతులు, ఏనుగులు, పులులు, సింహాలు, కుక్క పిల్లలు, పక్షులకు సంబంధించిన వీడియోలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. అందులో కొన్ని వీడియో చూస్తుంటే ఆశ్చర్యం కలిగిస్తుంటాయి. అలాగే కొన్ని నవ్వులు పూయిస్తుంటాయి. ముఖ్యంగా ఇటీవల కుక్క పిల్లలకు సంబంధించిన వీడియోలు తెగ ముచ్చటేస్తుంటాయి. తాజాగా ఒక కుక్క పిల్ల మరో కుక్క పిల్లను ముద్దు పెట్టుకుని తెగ సంబరపడిపోయింది. గంతలేస్తూ ఉక్కిరిబిక్కిరి అవుతూ తన ఆనందాన్ని తెలియజేసింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
అందులో 2 అడుగుల ఎత్తులో ఉన్న ఒక గోల్డెన్ రిట్రీవర్ అనే జాతికి చెందిన ఒక కుక్క పిల్ల ఉండగా.. దాని పక్కన వెనుక కాళ్లపై మరో కుక్క పిల్ల నిల్చుని ఉంది.. కాసేపటి వరకు సహనంగా నెమ్మదిగా నిల్చున్న కుక్కపిల్ల వద్దకు వచ్చి ముద్దాడింది.. ఆ తర్వాత ఎంతో ఉత్సాహంగా గంతులేస్తూ అక్కడ చక్కర్లు కొట్టింది. ఉక్కిరిబిక్కిరి అవుతూ రకరకాల చేష్టలు చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. మీరు ఆ క్యూట్ వీడియోను చూసేయ్యండి..
The first kiss.. ? pic.twitter.com/JWZdIGp0MW
— Buitengebieden (@buitengebieden) June 19, 2022
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.