Sai Dharam Tej: స్పీడ్ పెంచిన మెగా హీరో… సక్సెస్ ఫుల్ డైరెక్టర్‏తో సాయి ధరమ్ తేజ్ కొత్త ప్రాజెక్ట్ షూరు..

గతేడాది బైక్ యాక్సిడెంట్ జరిగి సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. కొన్నాళ్లపాటు విశ్రాంతి తీసుకున్న మేగా మేనల్లుడు ఇప్పుడు పూర్తిగా

Sai Dharam Tej: స్పీడ్ పెంచిన మెగా హీరో... సక్సెస్ ఫుల్ డైరెక్టర్‏తో సాయి ధరమ్ తేజ్ కొత్త ప్రాజెక్ట్ షూరు..
Sai Dharam Tej
Follow us
Rajitha Chanti

|

Updated on: Jun 20, 2022 | 6:48 AM

మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా అరంగేట్రం చేసి తన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej). అతి తక్కువ సమయంలోనే ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి మెప్పించారు.. గతేడాది బైక్ యాక్సిడెంట్ జరిగి సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. కొన్నాళ్లపాటు విశ్రాంతి తీసుకున్న మేగా మేనల్లుడు ఇప్పుడు పూర్తిగా కోలుకుని కెమెరా ముందుకు వస్తున్నాడు. మళ్లీ వరుస ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ బిజీగా మారేందుకు సిద్ధమయ్యాడు. ఇటీవలే తన 15వ చిత్రానికి సంబంధించిన అప్డేట్ ఇచ్చిసన సంగతి తెలిసిందే. తాజాగా మరో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ సినిమాకు తేజ్ ఒకే చెప్పినట్లుగా తెలుస్తోంది. రచ్చ, బెంగాల్ టైగర్, గౌతమ్ నందా, సీటీమార్ వంటి చిత్రాలతో హిట్స్ అందుకున్న డైరెక్టర్ సంపత్ నంది. ఇక ఇటీవలే మ్యాచో హీరో గోపిచంద్ ప్రధాన పాత్రలో తెరకెక్కించిన సీటిమార్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు సంపత్. కబడ్డి నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాలో తమన్నా కథానాయికగా నటించింది..

ఇప్పుడు ఆయన దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ ఓ మూవీ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. వీరిద్దరి కాంబోలో రాబోతున్న చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించనుందని.. బిజినెస్ నేపథ్యంలో పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో రూపొందించబోతున్నారని టాక్. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ మొత్తం కంప్లీట్ అయ్యిందని.. త్వరలోనే ఈ మూవీ సెట్స్ పైకీ వెళ్లనుంది. ఇందులో తేజ్ సరికొత్త లుక్ లో కనిపించనున్నారట. ఇక ప్రస్తుతం తేజ్.. డైరెక్టర్ కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ30 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. అంతేకాకుండా ఈ చిత్రానికి సుకుమార్‌ స్క్రీన్‌ప్లే, కథ కూడా అందిస్తుండడం విశేషం.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?