Chor Bazaar: సెన్సార్ కంప్లీట్ చేసుకున్న ఆకాష్ పూరి సినిమా.. చోర్ బజార్ రిలీజ్ ఎప్పుడంటే ?..

ఐవి ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మాత వీఎస్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా ఈనెల

Chor Bazaar: సెన్సార్ కంప్లీట్ చేసుకున్న ఆకాష్ పూరి సినిమా.. చోర్ బజార్ రిలీజ్ ఎప్పుడంటే ?..
Chor Bazaar
Follow us
Rajitha Chanti

|

Updated on: Jun 20, 2022 | 8:09 AM

యంగ్ హీరో అకాష్ పూరి ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం చోర్ బజార్ (Chor Bazaar). ఈ చిత్రానికి జార్జీ రెడ్డి ఫేమ్ డైరెక్టర్ జీవన్ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా.. గెహనా సిప్పీ కథానాయికగా నటిస్తోంది. ఐవి ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మాత వీఎస్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా ఈనెల 24న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్ షూరు చేసింది చిత్రయూనిట్. ఈ క్రమంలో తాజాగా చోర్ బజార్ మూవీ సెన్సార్ పనులు పూర్తిచేసుకుంది. సెన్సార్ యూనిట్ ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్ అందించింది..

మాస్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తనయుడిగా చిత్రపరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేక గుర్తంపు తెచ్చుకున్నాడు యంగ్ హీరో ఆకాష్. చైల్డ్ ఆర్టిస్ట్‏గా ఎన్నో సినిమాల్లో నటించి ఇప్పుడు హీరోగా రాణిస్తున్నాడు. ఇటీవల మెహబుబా, రొమాంటిక్ వంటి చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ ఆశించినంత స్థాయిలో అలరించలేకపోయాడు ఈ యంగ్ హీరో.. ఇప్పుడు ఆకాష్ పూరి ఆశలన్ని చోర్ బజార్ సినిమాపైనే ఉన్నాయి. ఈ సినిమాకు సురేష్ బొబ్బిలి సంగీతం అందించగా.. ప్రముఖ బ్యానర్ యూవీ క్రియేషన్స్ రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, సాంగ్స్ మూవీపై మరింత క్యూరియాసిటీని పెంచేసింది. ఈ మూవీలో సీనియర్‌ నటి అర్చన, సునీల్‌, సంపూర్ణేశ్‌ బాబు తదితరులు కీలకపాత్రలలో నటించారు. ఈ సినిమాలో బచ్చన్ సాబ్ పాత్రలో కనిపించనున్నాడు ఆకాష్ పూరి.

ట్వీట్..

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?