AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gurthunda Seethakalam: జీవితంలో గుర్తుకు వచ్చే ప్రేమ జ్ఞాపకాలు.. గుర్తుందా శీతాకాలం రిలీజ్ డేట్ ఫిక్స్..

ఈ సినిమాను నాగ‌శేఖ‌ర్ మూవీస్ బ్యాన‌ర్, మణికంఠ ఎంటర్‌టైన్మెంట్స్, వేదాక్షర ఫిల్మ్స్ బ్యానర్స్‌పై భావ‌న‌ ర‌వి, నాగశేఖర్, రామారావు చింతపల్లి, ఎమ్ ఎస్ రెడ్డి, చిన‌బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Gurthunda Seethakalam: జీవితంలో గుర్తుకు వచ్చే ప్రేమ జ్ఞాపకాలు.. గుర్తుందా శీతాకాలం రిలీజ్ డేట్ ఫిక్స్..
Gurthunda Sheethakalam
Rajitha Chanti
|

Updated on: Jun 20, 2022 | 8:38 AM

Share

టాలీవుడ్ మోస్ట్ టాలెంటెడ్ యంగ్ హీరో సత్యదేవ్, మిల్కీ బ్యూటీ తమన్నా జంటగా నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం గుర్తుందా శీతాకాలం (Gurthunda Seethakalam). ఈ చిత్రానికి డైరెక్టర్ నాగ శేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను నాగ‌శేఖ‌ర్ మూవీస్ బ్యాన‌ర్, మణికంఠ ఎంటర్‌టైన్మెంట్స్, వేదాక్షర ఫిల్మ్స్ బ్యానర్స్‌పై భావ‌న‌ ర‌వి, నాగశేఖర్, రామారావు చింతపల్లి, ఎమ్ ఎస్ రెడ్డి, చిన‌బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్ర‌తీ ఒక్క‌రు త‌మ జీవితంలో సెటిల్ అయిన తర్వాత కొన్ని విష‌యాల్ని ఎప్ప‌టికీ మ‌రిచిపోరు. ముఖ్యంగా టీనేజ్, కాలేజ్ ఆ తర్వాత వ‌చ్చే యూత్ లైఫ్‌లో జ‌రిగే సంఘ‌ట‌న‌లు జీవితాంతం గుర్తుకు వ‌స్తూనే ఉంటాయి. ఈ సినిమా నిర్మాతల్లో ఒకరైన రామారావు చింతపల్లి గారు వరస సినిమాలతో ఇండస్ట్రీలో తన మార్క్ చూపించుకుంటున్నారు. క్రేజీ ప్రాజెక్టులను ఆయన నిర్మిస్తూ హ్యాపెనింగ్ ప్రొడ్యూసర్‌గా మారుతున్నారు. గుర్తుందా శీతాకాలం నిర్మాణంలో ఈయన భాగస్వామ్యం చాలా ఉంది.

ఇప్ప‌టికే ఈ సినిమా టైటిల్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇందులో మేఘా ఆకాష్, కావ్య‌శెట్టి తదితరులు నటిస్తున్నారు. దాంతో ఈ సినిమాపై ఆసక్తి బాగా పెరిగిపోయింది. ఇండ‌స్ట్రీలో వ‌ర్గాల్లోనూ ఈ సినిమాపై ప్ర‌త్యేక ఆస‌క్తి నెల‌కొంది. క‌న్న‌డ‌లో విడుద‌లై సూప‌ర్ హిట్ అయిన ‘ల‌వ్ మాక్‌టైల్’ ఆధారంగా ‘గుర్తుందా శీతాకాలం’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టైటిల్ సాంగ్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అందులో సత్యదేవ్, తమన్నా కెమిస్ట్రీ ఈ పాటకు హైలైట్. ఈ పాట అభిమానులకే కాదు అందరికీ బాగా నచ్చేస్తుంది. గతంలోనే విడుదల కావాల్సిన ఈ మూవీ కరోనా సంక్షోభంతో వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పలుమార్లు విడుదల తేదీని ప్రకటించిన మేకర్స్.. తాజాగా మరోసారి రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. గుర్తుందా శీతాకాలం సినిమా జులై 15న విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు దర్శక నిర్మాతలు. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు చిత్రయూనిట్.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్