Vegetable Prices Today: కూరగాయలు కొనేవారికి పండగలాంటి వార్త.. తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఢమాల్.. నేటి రేట్లు ఇవే..
కూరగాయల ధరలు తగ్గడంతో వినియోగదారులకు పెద్ద ఊరట లభించింది. ఈ ధరల తగ్గుదల గృహ బడ్జెట్‌పై సానుకూల ప్రభావం చూపుతుంది. దీపావళికి ముందే ధరలు తగ్గుతుండటం పెద్ద ఉపశమనంగా చెప్పవచ్చు. దీని వల్ల సామాన్యులకు ఇంటి ఖర్చు తగ్గుతుంది. నవంబర్ 1న కూరగాయల ధరలు ఇలా ఉన్నాయి.

దేశవ్యాప్తంగా కూరగాయల ధరలు తగ్గుతున్నాయి. ముఖ్యంగా టమాటో, ఉల్లిపాయల ధరలు ఇటీవల జెడ్ స్పీడ్‌లో దూసుకెళ్లగా.. ఇప్పుడు పతనమవుతున్నాయి. దీతో సామాన్య ప్రజలకు భారీ ఊరట లభించింది. తెలుగు రాష్ట్రాల్లో కూడా ధరలు కొద్ది రోజులుగా డౌన్ అవుతుండగా.. నవంబర్ నెల ప్రారంభమైన ఈ రోజే కూడా ధరలు తగ్గుముఖం పట్టాయి. తాజా ధరల ప్రకారం టమాటో ధర కిలో రూ.27కి చేరగా.. ఉల్లిపాయలు కిలో రూ.40కు లభిస్తున్నాయి. చాలాకాలంగా అధిక ధరలతో సతమతమవుతున్న వినియోగదారులకు ఈ ధరల తగ్గుదల ఉపశమనం కల్గిస్తోంది. వంటగదిలో నిత్యావసరాలైన టమాటో, ఉల్లిపాయల ధరలు తగ్గడం వల్ల కుటుంబాల నెలవారీ ఖర్చులపై సానుకూల ప్రభావం పడుతుంది. నవంబర్ 1న ఆదివారం వివిధ నగరాల్లోని రైతు బజార్లలో ధరలు ఎలా ఉన్నాయో చూడండి..
హైదరాబాద్‌లో కూరగాయల ధరలు..
నవంబర్ 1న కూకట్‌పల్లి మోడ్రన్ అండ్ మోడల్ రైతుబజార్‌లో కిలో టమాటా రూ.27, వంకాయ రూ.18, బెండకాయ రూ.45, పచ్చిమిర్చి రూ.48, బజ్జీ మిర్చి రూ.50, కాకరకాయ రూ.35, బీరకాయ రూ.35, క్యాబేజీ రూ.13, చిక్కుడుకాయలు రూ.60, క్యారెట్ రూ.40, కాలీఫ్లవర్ రూ.30, దొండకాయ రూ.25 పలుకుతున్నాయి. ఇక పొలం చిక్కుడు రూ.45, గోరుచిక్కుడు రూ.35, బీట్‌రూట్ రూ.23, క్యాప్సికం రూ.50, ఆలుగడ్డ రూ.24, స్థానిక కీరదోస రూ.28, ఇటాలియన్ కీరదోస రూ.38, దోసకాయ రూ.24, సొరకాయ రూ.20, పొట్లకాయ రూ.22, కందగడ్డ రూ.28, ఉల్లికాడలు రూ.55, ఎండు ఉల్లిగడ్డ రూ.40కు లభిస్తున్నాయి. అలాగే పచ్చి మామిడికాయలు రూ.15 నుంచి రూ.20, అరటికాయలు రూ.9 నుంచి రూ.10, చామగడ్డ రూ.35, ముల్లంగి ఒక్కటి రూ.6 నుంచి రూ.8, చిలగడదుంప రూ.40, గుమ్మడికాయ రూ.40, నిమ్మకాయలు డజను రూ.50 నుంచి రూ.60, మునగకాయ ఒక్కటి రూ.10 నుంచి రూ.12, బొప్పాయి రూ.50కి వ్యాపారులు విక్రయిస్తున్నారు. పుట్టగొడుగులు (200 గ్రాములు) రూ.50, ఎండు మిర్చి రూ.280, పాత అల్లం రూ.180, కొత్త అల్లం రూ.120, వెల్లుల్లి రూ.260, చింతపండు రూ.160, ఎర్ర మిర్చి రూ.80, ఉసిరికాయలు రూ.60, కరివేపాకు రూ.60, పర్వల్ రూ.40, వేరుశనగలు రూ.60, లోబియా రూ.40, ఆకాశకాకరకాయ రూ.105గా కొనసాగుతున్నాయి.
విజయవాడలో నేటి కూరగాయల ధరలు
విజయవాడలోని రైతు బజార్లలో కిలో టమాట రూ.40, వంగ రూ.22, బెండ రూ.24, పచ్చిమిర్చి రూ.40, కాకర రూ.34, క్యాబేజీ రూ.25, క్యారెట్ రూ.48, దొండ రూ.26, బంగాళదుంప రూ.26, ఉల్లిపాయలు రూ.39, గోరుచిక్కుడు రూ.30, దోస రూ.24, సొర రూ.15, చిక్కుళ్లు రూ.56, బీర రూ.36, చామదుంప రూ.34, కంద రూ.34, బీట్ రూట్ రూ.38, కీర దోస రూ.46, బీన్స్ రూ.100, క్యాప్చికం రూ.66, అలసందలు రూ.40, చిలకడదుంప రూ.46, కొత్తిమీర రూ.20 పలుకుతోంది.
