Madhya Pradesh: మవోయిస్టులు-భద్రతా బలగాల మధ్య కాల్పులు.. ముగ్గురు హతం

మధ్యప్రదేశ్(Madhya Pradesh) లో కాల్పులు మరోసారి దద్దరిల్లాయి. మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ముగ్గురు మావోలు మృతి చెందారు. బాలాఘాట్ జిల్లాలోని బహేలా పోలీస్ స్టేషన్ లో పరిధిలో ఈ కాల్పులు(Encounter)...

Madhya Pradesh: మవోయిస్టులు-భద్రతా బలగాల మధ్య కాల్పులు.. ముగ్గురు హతం
Maoists
Follow us
Ganesh Mudavath

|

Updated on: Jun 20, 2022 | 4:59 PM

మధ్యప్రదేశ్(Madhya Pradesh) లో కాల్పులు మరోసారి దద్దరిల్లాయి. మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ముగ్గురు మావోలు మృతి చెందారు. బాలాఘాట్ జిల్లాలోని బహేలా పోలీస్ స్టేషన్ లో పరిధిలో ఈ కాల్పులు(Encounter) జరిగినట్లు పోలీసులు తెలిపారు. లోదంగి అటవీ ప్రాంతంలో సోమవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. మహారాష్ట్ర సరిహద్దులో జరిగిన ఈ ఎన్ కౌంటర్ లో చనిపోయిన ముగ్గురిపై రివార్డు ఉందని మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా(Home Minister Narottam Mishra) తెలిపారు. ఒకరిపై రూ.15లక్షలు రివార్డు ఉండగా.. మరో ఇద్దరిపై రూ.8 లక్షలు చొప్పున రివార్డు ఉంది. మృతి చెందిన మావోయిస్టుల్లో ఒక మహిళ ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. అయితే, ఈ ముగ్గురి మావోలపై మొత్తంగా రూ.30లక్షల రివార్డు ఉండటం గమనార్హం. నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతాల్లో కూంబింగ్‌ నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర హో మంత్రి వెల్లడించారు.

మరోవైపు.. జమ్మూకశ్మీర్ లోనూ ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య జరిగిన కాల్పుల్లో నలుగురు ముష్కరులు హతమయ్యారు. కుప్వారా, కుల్గాం జిల్లాల్లో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో నలుగురు ముష్కరులు(Militants) మృత్యువాతపడ్డారు. మృతుల్లో ఒకరు పాకిస్తానీ అని, లష్కరే తొయిబా సంస్థ కోసం పనిచేస్తున్నాట్లు అధికారులు గుర్తించారు. షౌకత్ అహ్మద్ షేక్​అనే ఉగ్రవాదిని పోలీసులు ఇటీవల అరెస్టు చేశారు. ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించగా భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు.

ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య జరిగిన భీకర కాల్పుల్లో ఇద్దరు ముష్కరులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ఒకడు లష్కరే తొయిబా కోసం పనిచేస్తున్న పాకిస్థానీ అని ఐజీ విజయ్ కుమార్ వెల్లడించారు. కుల్గాం జిల్లా దమ్హల్ హంజీపొరాలో జరిగిన ఘటనలో మరో ఇద్దరు ఉగ్రవాదులు చనిపోయారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రైం వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి