Hyderabad: హైదరాబాద్ లో భారీ వర్షం.. తడిసిముద్దయిన భాగ్య నగరం
హైదరాబాద్(Hyderabad) లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. రాజేంద్ర నగర్, పాతబస్తీ, కోఠి, అసెంబ్లీ, నాంపల్లి, బషీర్ బాగ్, గాంధీభవన్, అసెంబ్లీ, ఖైరతాబాద్, సికింద్రాబాద్, దిల్‌సుఖ్ నగర్, అంబర్‌పేట, కాచిగూడ, నల్లకుంట, గోల్నాక ప్రాంతాల్లో...
హైదరాబాద్(Hyderabad) లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. రాజేంద్ర నగర్, పాతబస్తీ, కోఠి, అసెంబ్లీ, నాంపల్లి, బషీర్ బాగ్, గాంధీభవన్, అసెంబ్లీ, ఖైరతాబాద్, సికింద్రాబాద్, దిల్‌సుఖ్ నగర్, అంబర్‌పేట, కాచిగూడ, నల్లకుంట, గోల్నాక ప్రాంతాల్లో వాన పడింది. నగరమంతా మేఘావృతమై వాతావరణం చల్లబడింది. కూకట్‌పల్లి, నిజాంపేట, బాచుపల్లిలో భారీ వర్షం కురవడంతో మురుగు నీరు రహదారిపైకి చేరింది. పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్ పేట్ ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపైకి నీరు చేరడంతో వాహనదారులు తీవ్రఇబ్బందులు పడ్డారు.
మరోవైపు.. ఇవాళ, రేపు తెలంగాణలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. కర్ణాటక నుంచి తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి ఆవరించగా.. తెలంగాణలో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. వీటి ప్రభావంతో వర్షాలు కురుస్తున్నట్లు తెలిపారు.
మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి