Telangana: వచ్చే ఎన్నికల్లో పాలేరు నుంచే పోటీ చేస్తా.. మంత్రి పువ్వాడకు షర్మిల సవాల్

వైఎస్సార్ తెలంగాణ పార్టీ (YTP) అధ్యక్షురాలు వైఎస్.షర్మిల(YS.Sharmila) కీలక ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో తాను ఖమ్మం జిల్లా పాలేరు నుంచే పోటీ చేస్తున్నట్లు వెల్లడించారు. నేలకొండపల్లి శివారులో నిర్వహించిన పార్టీ నేతల సమావేశంలో ఆమె మాట్లాడారు...

Telangana: వచ్చే ఎన్నికల్లో పాలేరు నుంచే పోటీ చేస్తా.. మంత్రి పువ్వాడకు షర్మిల సవాల్
Sharmila
Follow us
Ganesh Mudavath

|

Updated on: Jun 19, 2022 | 6:08 PM

వైఎస్సార్ తెలంగాణ పార్టీ (YTP) అధ్యక్షురాలు వైఎస్.షర్మిల(YS.Sharmila) కీలక ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో తాను ఖమ్మం జిల్లా పాలేరు నుంచే పోటీ చేస్తున్నట్లు వెల్లడించారు. నేలకొండపల్లి శివారులో నిర్వహించిన పార్టీ నేతల సమావేశంలో ఆమె మాట్లాడారు. కార్యకర్తలు, పార్టీ నేతల వల్లే తాను 1,300 కిలోమీటర్లు నడిచినట్లు చెప్పారు. పాలేరు నుంచి పోటీ చేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారన్న షర్మిల.. ఖమ్మం జిల్లాలో(Khammam) వైఎస్సార్‌ ఫొటో పెట్టుకుని ఎంతో మంది గెలిచారని పేర్కొన్నారు. వైఎస్సార్ ను విమర్శించే స్థాయి మంత్రి పువ్వాడకు లేదని చెప్పారు. బయ్యారం మైనింగ్‌లో తనకు వాటా ఉన్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని, ఈ విషయంలో తన బిడ్డలపై ప్రమాణం చేసి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. మంత్రిగా ఎటువంటి అవినీతికి పాల్పడలేదంటూ తన బిడ్డలపై ప్రమాణం చేసే ధైర్యం పువ్వాడకు ఉందా? అని ఆమె సవాల్‌ విసిరారు. ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

వైఎస్సార్‌ సంక్షేమ పాలన పాలేరు నుంచే మొదలు కావాలి. వైటీపీ జెండా పాలేరు గడ్డపై ఎగరాలి. అత్యధిక మెజారిటీ కోసం అందరూ పనిచేయాలి. చరిత్రలో ఎన్నడూ ఎరగని మెజారిటీ కోసం పనిచేద్దాం.

      – వైఎస్ షర్మిల, వైటీపీ అధ్యక్షురాలు

ఇవి కూడా చదవండి

కాగా.. కొన్ని రోజుల క్రితం వైటీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అన్నతో పంచాయితీ ఉంటే ఆంధ్రలో చూసుకోవాలని.. తెలంగాణకు వచ్చి ఏం సాధిస్తారని ఘాటుగా ప్రశ్నించారు. దమ్ముంటే ఖమ్మంలో నాపై పోటీ చేసి గెలిచి చూపించాలని సవాల్ విసిరారు. పాలేరులోనూ నా దమ్ము చూపిస్తానని తీవ్రంగా స్పందించారు. ఈ వ్యాఖ్యలు అప్పట్లో పెను సంచలనంగా మారాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు