AP Inter Admissions 2022: రేపట్నుంచి ఏపీ ఇంటర్ ఫస్టియర్ ప్రవేశాలు.. జులై 1 నుంచి తరగతులు..
ఆంధ్రప్రదేశ్ ఇంటర్ ఫస్టియర్ 2022-23 ప్రవేశాలకు సంబంధించిన షెడ్యూల్‌ను ఇంటర్ బోర్డు (BIEAP) సెక్రటరి శేషగిరి బాబు ఈ రోజు (జూన్ 19) విడుదల చేశారు. తాజా షెడ్యూల్ ప్రకారం జూన్ 20 నుంచి ఇంటర్ ప్రవేశాలకు..
AP Inter first and second year classes to commence from july 1: ఆంధ్రప్రదేశ్ ఇంటర్ ఫస్టియర్ 2022-23 ప్రవేశాలకు సంబంధించిన షెడ్యూల్‌ను ఇంటర్ బోర్డు (BIEAP) సెక్రటరి శేషగిరి బాబు ఈ రోజు (జూన్ 19) విడుదల చేశారు. తాజా షెడ్యూల్ ప్రకారం జూన్ 20 నుంచి ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుంది. జులై 20 నాటికి మొదటి విడత (AP Inter First Year admissions) ప్రవేశాలు ముగుస్తాయి. ఈ నేపథ్యంలో ఇంటర్మీడియట్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన విధివిధానాలు ఈ మేరకు బోర్డు ప్రకటించింది. ఇంటర్ ప్రవేశాలు పదో తరగతి మార్కుల ఆధారంగా, రిజర్వేషన్ ప్రకారం చేపట్టనున్నట్లు తెల్పింది. మొదటి విడతలో మిగిలిన సీట్లను జనరల్‌గా మార్చి ప్రవేశాలు కల్పిస్తారు. సెక్షన్‌కు 88 మంది విద్యార్ధుల చొప్పున సీట్లు ఇవ్వనున్నారు. ఐతే వొకేషనల్, పారామెడికల్ కోర్సులకు మాత్రం ఒక సెక్షన్‌కు 30 మందిని కేటాయిస్తారు. ప్రతి కాలేజీ బయట మొత్తం సీట్లు, భర్తీ అయినవి, మిగిలిపోయిన సీట్లకు సంబంధించిన వివరాలను అందుబాటులో ఉంటాయి.
ముఖ్యమైన తేదీలు ఇవే..
- దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ: జూన్ 20, 2022.
- దరఖాస్తులకు చివరి తేదీ: జులై 20, 2022.
- మొదటి విడత ఇంటర్ ఫస్టియర్ ప్రవేశాలు: జూన్ 27, 2022.
- మొదటి విడత ఇంటర్ ఫస్టియర్ ప్రవేశాల ముగింపు తేదీ: జులై 20, 2022.
- ఇంటర్ ఫస్టియర్ తరగతుల ప్రారంభ తేదీ: జులై 1, 2022.
జులై 1 నుంచి తరగతులు ప్రారంభం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్, కోఆపరేటివ్, రెసిడెన్షియల్, సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, మోడల్ జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ అన్ని కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నట్లు బోర్డు తెల్పింది. రెండేళ్ల సాధారణ ఇంటర్మీడియట్‌తో పాటు ఒకేషనల్ కోర్సుల్లో విద్యార్ధులకు కూడా ప్రవేశాలు కల్పించనున్నారు. జులై 1 నుంచి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ విద్యార్ధులందరికీ తరగతులు ప్రారంభమవుతాయి. ఇంటర్ ప్రవేశాల కోసం ఎలాంటి ప్రవేశపరీక్షలు నిర్వహించరాదని, ఒకవేళ ఏ కాలేజీ అయిన పరీక్షలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా ఇంటర్ బోర్డు కార్యదర్శి శేషగిరి బాబు హెచ్చరికలు జారీ చేశారు.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.