ANGRAU Guntur Jobs 2022: 8వ తరగతి అర్హతతో.. గుంటూరులోని రీజనల్ అగ్రికల్చరల్ రీసెర్చ్ స్టేషన్‌లో ఉద్యోగాలు..
ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ పరిధికి చెందిన గుంటూరులోని రీజనల్ అగ్రికల్చరల్ రీసెర్చ్ స్టేషన్ (RARS Guntur).. ఒప్పంద ప్రాతిపదికన హెల్పర్, సీనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టుల (Healper and SRF Posts) భర్తీకి అర్హులైన..
ANGRAU Guntur Healper and SRF Recruitment 2022: ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ పరిధికి చెందిన గుంటూరులోని రీజనల్ అగ్రికల్చరల్ రీసెర్చ్ స్టేషన్ (RARS Guntur).. ఒప్పంద ప్రాతిపదికన హెల్పర్, సీనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టుల (Healper and SRF Posts) భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులనుకోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు విధానం, ఎంపిక ప్రక్రియ వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం పోస్టులు: 2
పోస్టులు: హెల్పర్, సీనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టులు
వయోపరిమితి: పోస్టును బట్టి అభ్యర్ధుల వయసు 35 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.
అర్హతలు:
- హెల్పర్ పోస్టులకు 8వ తరగతి చదివిన అభ్యర్థులు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. పే స్కేల్: నెలకు రూ.10,000ల వరకు చెల్లిస్తారు.
- సీనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టులకు సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎంటెక్/ఎమ్మెస్సీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. పే స్కేల్: నెలకు రూ.21,000ల వరకు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి గల అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూకి హాజరవ్వాలి.
అడ్రస్: Regional Agricultural Research Station, Lam, Guntur 522034.
ఇంటర్వ్యూ తేదీ: జూన్ 14, 2022 ఉదయం 11 గంటలకు ప్రారంభం.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.