Fact Check: బైజుస్‌తో ఏపీ సర్కార్ ఒప్పందంపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం.. క్లారిటీ ఇచ్చిన అధికారులు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యనందించేందుకు విద్యాశాఖ బైజూస్‌ (BYJU's) ఎడ్-టెక్ కంపెనీతో శుక్రవారం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి..

Fact Check: బైజుస్‌తో ఏపీ సర్కార్ ఒప్పందంపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం.. క్లారిటీ ఇచ్చిన అధికారులు
Ap Govt Mou With Byju's
Follow us
Srilakshmi C

| Edited By: Ravi Kiran

Updated on: Jun 18, 2022 | 7:00 PM

AP Education News: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యనందించేందుకు సీఎం జగన్ బైజూస్‌ (BYJU’s) ఎడ్-టెక్ కంపెనీతో శుక్రవారం ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి మీడియాతో ఈ విధంగా మాట్లాడారు.. ‘ఎడ్-టెక్ కంపెనీ రూపొందించిన కంటెంట్‌ యాక్సెస్ చేసిన ట్యాబ్‌లను ప్రతి ఏడాది 8 వ తరగతిలోకి వచ్చే విద్యార్ధులకు పంపిణీ చేస్తాం. వాళ్లు 9వ తరగతికి చేరే సరికి ఆ ట్యాబ్‌లలోని కంటెంట్‌ అప్‌గ్రేడ్‌ అవుతుంది. ఆ తర్వాత 10వ తరగతిలోకి వెళ్లేసరికి కంటెంట్‌ మళ్లీ అప్‌గ్రేడ్‌ అవుతుంది. ఈ విధంగా ప్రతి ఏడాది 8వ తరగతిలోకి ప్రవేశించే విద్యార్థులకు ట్యాబ్‌లను పంపిణీ చేస్తాం. ఫలితంగా సీబీఎస్సీ పరీక్షల్లో పాస్‌ కావడానికి విద్యార్ధులకు ఉపయోగపడుతుంది. ఈ ఏడాది పాఠ్య పుస్తకాలు ఇప్పటికే ముద్రించబడినందున వచ్చే ఏడాది నుంచి 4 నుంచి 10వ తరగతి విద్యార్థులకు ద్విభాషా పాఠ్య పుస్తకాల్లో బైజు కంటెంట్‌ను పొందుపరుస్తాం’ అని సీఎం జగన్ అన్నారు.

ఇంకా ఈ విధంగా మట్లాడారు.. ‘బైజూస్‌ కంపెనీ కూడా ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్ధులకు అనుగుణంగా స్పంధించింది. బైజుస్‌ కంటెంట్‌ని యాక్సెస్ చేయడానికి, ఒక ప్రైవేట్ పాఠశాల విద్యార్థికి సుమారుగా రూ. 20,000ల నుంచి రూ. 24,000ల వరకు ఖర్చవుతుంది. ఐతే ఈ విధమైన కంటెంట్‌ను ఉచితంగా అందించేందుకు బైజూస్‌ ముందుకు రావడం శుభపరిణామం. కంటెంట్‌ ఫ్రీ.. ట్యాబ్‌లకు మాత్రమే మనం ఖర్చు పెట్టాలి. ప్రతీ ఏటా 4 లక్షల 70 వేల ట్యాబ్‌లను పంపిణీ చేయడానికి రూ.500 కోట్లకుపైగా ఖర్చవుతుంది. అత్యధిక ఖర్చుతో కూడుకున్నప్పటికీ క్వాలిటీ ఎడ్యుకేషన్‌ ఇవ్వాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని’ సీఎం జగన్‌ అన్నారు.

ఇవి కూడా చదవండి

ఇదీ వాస్తవం: ఒక ట్యాబ్లెట్ ఖరీదు రూ. 4 లక్షల 70 వేలు అవుతుందన్నట్లు  సీఎం జగన్ మాట్లాడారని సోషల్ మీడియాలో తప్పుగా ప్రచారం జరుగుతోంది. 4 లక్షల 70 వేల మంది విద్యార్ధులకు ట్యాబ్ లను పంపిణీ చేస్తున్నట్లు, అందుకు అయ్యే ఖర్చు గురించి ముఖ్యమంత్రి మాట్లాడారు. దీనిపై ఈ విధంగా అధికారులు ట్విటర్ ద్వారా వివరణ ఇచ్చారు.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?