Supreme Court Recruitment 2022: సుప్రీంకోర్టులో 210 జూనియర్ కోర్టు అసిస్టెంట్ పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..

భారత ప్రభుత్వానికి చెందిన న్యూఢిల్లీలోని సుప్రీం కోర్టు (Supreme Court)లో.. జూనియర్ కోర్టు అసిస్టెంట్ (గ్రూప్-బి నాన్ గెజిటెడ్) (Junior Court Assistant Posts) పోస్టుల భర్తీకి..

Supreme Court Recruitment 2022: సుప్రీంకోర్టులో 210 జూనియర్ కోర్టు అసిస్టెంట్ పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..
Supreme Court
Follow us

|

Updated on: Jun 19, 2022 | 8:29 AM

Supreme Court Junior Translator Recruitment 2022: భారత ప్రభుత్వానికి చెందిన న్యూఢిల్లీలోని సుప్రీం కోర్టు (Supreme Court)లో.. జూనియర్ కోర్టు అసిస్టెంట్ (గ్రూప్-బి నాన్ గెజిటెడ్) (Junior Court Assistant Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

ఖాళీల సంఖ్య: 210

ఇవి కూడా చదవండి

పోస్టుల వివరాలు: జూనియర్ కోర్టు అసిస్టెంట్ (గ్రూప్-బి నాన్ గెజిటెడ్) పోస్టులు

వయోపరిమితి: జనవరి 1, 2022 నాటికి అభ్యర్ధుల వయసు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.

పే స్కేల్: నెలకు రూ.35,400ల నుంచి రూ.63,068ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: ఇంగ్లీష్‌ టైపింగ్ నైపుణ్యంతోపాటు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. కంప్యూటర్‌ పరిజ్ఞానం అవసరం.

ఎంపిక విధానం: రాత పరీక్ష, కంప్యూటర్‌లో టైపింగ్ స్పీడ్ టెస్ట్, డిస్క్రిప్టివ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

రాత పరీక్ష విధానం: మొత్తం 100 ఆబ్జెక్టివ్‌ టైప్‌ ప్రశ్నలకు 2 గంటల్లో సమాధానాలు రాయవల్సి ఉంటుంది. ఈ పరీక్ష రోజున కంప్యూటర్‌ నాలెడ్జ్‌ టెస్ట్‌ (25 మార్కులకు), ఇంగ్లీష్‌ టైపింగ్‌ టెస్ట్ (35 మార్కులకు,10 నిముషాలు), ఎస్సే రైటింగ్‌ టెస్ట్ (2 గంటలు) కూడా నిర్వహిస్తారు. ప్రతిభ కనబరచిన అభ్యర్ధులను ఇంటర్వ్యూకి పిలుస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు రుసుము:

  • జనరల్‌ అభ్యర్ధులకు: రూ.500
  • ఎస్సీ/ఎస్టీ/ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ అభ్యర్ధులకు: రూ.250

దరఖాస్తులకు చివరి తేదీ: జులై 10, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..
నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..
గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌
గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌
పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..
పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..
జనం ఉచిత బస్సు వద్దంటున్నారా.! కర్ణాటకలో ఎత్తేస్తారా.?
జనం ఉచిత బస్సు వద్దంటున్నారా.! కర్ణాటకలో ఎత్తేస్తారా.?
రాత్రిళ్లు తక్కువ నిద్రపోతున్నారా.! అయితే ఈ వీడియో మీకోసమే..
రాత్రిళ్లు తక్కువ నిద్రపోతున్నారా.! అయితే ఈ వీడియో మీకోసమే..
ATM దొంగతనాన్ని లైవ్‌లో చూసిన సిబ్బంది.. తర్వాత ఏం చేశారు.?
ATM దొంగతనాన్ని లైవ్‌లో చూసిన సిబ్బంది.. తర్వాత ఏం చేశారు.?
ఉత్తరాఖండ్‌లో HIV బాంబ్‌.. ఒకేసారి 19మందికి సోకిన ఎయిడ్స్‌.!
ఉత్తరాఖండ్‌లో HIV బాంబ్‌.. ఒకేసారి 19మందికి సోకిన ఎయిడ్స్‌.!
పసిబిడ్డను వంతెనపై నుంచి విసిరేసిన తల్లిదండ్రులు. తర్వాత ఏమైందంటే
పసిబిడ్డను వంతెనపై నుంచి విసిరేసిన తల్లిదండ్రులు. తర్వాత ఏమైందంటే
వారికి పదో తరగతిలో 10 మార్కులు వస్తే పాస్‌
వారికి పదో తరగతిలో 10 మార్కులు వస్తే పాస్‌
తెలుగు రాష్ట్రాల్లో పెళ్లి సందడి.. 60 రోజుల్లో లక్ష పెళ్లిళ్లు
తెలుగు రాష్ట్రాల్లో పెళ్లి సందడి.. 60 రోజుల్లో లక్ష పెళ్లిళ్లు