ఖాళీగా ఉన్న ఆ 8,000ల పోస్టులను వెంటనే భర్తీ చేయండి: సీఎం జగన్
గత ఏడాది జాబ్ క్యాలెండర్‌పై వివిధ శాఖల ఉన్నతాధికారులతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఏడాది కాలంగా రిక్రూట్‌మెంట్ సహా ఇంకా భర్తీ చేయాల్సిన పోస్టులపై సమగ్రంగా చర్చించారు..
Andhra Pradesh: గత ఏడాది జాబ్ క్యాలెండర్‌పై వివిధ శాఖల ఉన్నతాధికారులతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఏడాది కాలంగా రిక్రూట్‌మెంట్ సహా ఇంకా భర్తీ చేయాల్సిన పోస్టులపై సమగ్రంగా చర్చించారు. జాబ్ క్యాలెండర్‌లో భాగంగా రిక్రూట్ చేసిన పోస్టుల వివరాలతోపాటు, ఖాళీల వివరాలను కూడా అధికారులు సీఎంకు సమర్పించారు. బ్యాక్‌లాగ్ పోస్టులు, ఏపీపీఎస్సీ, వైద్య ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖ, ఉన్నత విద్య తదితర శాఖల్లో జరిగిన, జరుగుతున్న రిక్రూట్‌మెంట్‌పై సమగ్రంగా సీఎం చర్చించారు. 2021-22 ఏడాదిలో 39,654 పోస్టులు భర్తీ చేసినట్టు అధికారులు సీఎంకు తెలిపారు. ఒక్క వైద్య ఆరోగ్యశాఖలోనే 39,310 పోస్టులు భర్తీ చేసినట్టు తెలిపారు. గుర్తించిన 47,465 పోస్టుల్లో 83.5శాతం పోస్టుల రిక్రూట్‌మెంట్‌ను ఈ ఏడాదిలో పూర్తి చేసినట్టు తెలిపారు.
ఇంకా సుమారు 8,000ల పోస్టులు భర్తీ చేయాల్సి ఉందని, వీటిల్లో భర్తీ చేయాల్సిన పోస్టుల్లో 1,198 వైద్య ఆరోగ్యశాఖ పరిధిలోనే ఉన్నాయన్నారు. జాబ్ క్యాలెండర్‌లో మిగిలిన 8,000లకుపైగా ఉన్న పోస్టులను సత్వరమే భర్తీ చేయాలని అధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు. ఉన్నత విద్యలో ఖాళీల భర్తీపైనా దృష్టి పెట్టాలని, పోలీసు రిక్రూట్‌మెంట్‌పై కార్యాచరణ అమలు చేయాలని ఆదేశించారు. పోలీసు ఉద్యోగాల భర్తీపై కార్యాచరణ రూపొందించి దాని ప్రకారం క్రమం తప్పకుండా ఉద్యోగాల భర్తీ చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు.వైద్యారోగ్యశాఖలో మిగిలిన పోస్టులను జూన్ చివరినాటికి భర్తీ చేయాలని ఆదేశించారు. ఉన్నత విద్యాశాఖలో అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులను సెప్టెంబరులోగా భర్తీ చేయాలన్నారు. ఏపీపీఎస్సీలో పోస్టులను వచ్చే ఏడాది మార్చిలోగా భర్తీచేయాలని సీఎం నిర్దేశించారు. నిర్దేశించుకున్న సమయంలోగా ఈ పోస్టులను భర్తీ చేసేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.