Virata Parvam: వివాదంలో విరాట పర్వం మూవీ.. పోలీసు స్టేషన్లో ఫిర్యాదు.. కారణం ఏంటంటే
పీడిత వర్గాలకు అండగా..! బడుగు బలహీన వర్గాలకు మాటగా..! అన్యాయాన్ని.. దోపిడీని ప్రశ్నించే శక్తిగా..! సమసమాజ స్థాపనే ధ్యేయంగా..! విప్లవ భావాలతో.. మరిగే నెత్తురుతో..! ఆయుధం చేత పట్టి... అడవులను ఆవాసంగా మార్చుకుని చేసే పోరాటేమే..
పీడిత వర్గాలకు అండగా..! బడుగు బలహీన వర్గాలకు మాటగా..! అన్యాయాన్ని.. దోపిడీని ప్రశ్నించే శక్తిగా..! సమసమాజ స్థాపనే ధ్యేయంగా..! విప్లవ భావాలతో.. మరిగే నెత్తురుతో..! ఆయుధం చేత పట్టి.. అడవులను ఆవాసంగా మార్చుకుని చేసే పోరాటేమే.. బ్యాలెట్టు కంటే బుల్లెట్టునే నమ్ముకునే తత్వమే నక్సలిజం. ఈ ఇజం కోసం చేసే పోరాటంలో అసువులు బాసిన వీరులెందరో.. కనిపించకుండా పోయిన విప్లవ కారులెందరో.. వీరిని స్మరిస్తూ.. వారిని గుర్తు చేస్తూ.. విప్లవ భావాల అర్థం చెబుతూ.. వచ్చిన ఎర్ర జెండా సినిమాలెన్నో..! అలాంటి సినిమాలకు కాస్త దగ్గరగా.. విప్లవంలో పొద్దు పొడిసిన ప్రేమను చూపిస్తూ జూన్ 17న రిలీజైన చిత్రం విరాట పర్వం( Virata Parvam). అయితే ఈ సినిమాపై తాజాగా ఓ వివాదం రాజుకుంది. హైదరాబాద్ పోలీస్ స్టేషన్లోలో విరాట పర్వం సినిమా కు వ్యతిరేకంగా కేసు నమోదైంది.
నక్సలిజం నేపథ్యంగా సాగిన ఈ సినిమాకు సెన్సర్ బోర్డ్ ఎలా క్లియరెన్స్ ఇచ్చిందంటూ ప్రశ్నించారు VHP నేత అజయ్. ప్రశ్నించడమే కాదు ఇదే విషయంగా.. ఆయన హైదరాబాద్ సుల్తాన్ బజార్‌లో ఫిర్యాదు చేశారు. నక్సలిజం సెన్సార్ పైనే కాదు.. యవతను పెడదోవ పట్టించాల ఉందంటూ ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. వెంటనే ఈసినిమా ను అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. ఇక కాశ్మీరీ పండిట్ల ఊచకోతను.. గోసంరక్షకుల ఆగడాలను ఓకే గాటిన కడుతూ మాట్లాడిన సాయి పల్లవి పై కూడా ఇంతకు ముందు ఇదే పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు VHP నేతలు. మరి ఈ వివాదం మరెంత దూరం వెళ్తుందో చూడాలి.
మరిన్ని సినిమా వార్తలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి