Actress: బెడిసికొట్టిన సర్జరీ.. గుర్తుపట్టలేనంతగా మారిపోయిన సొగసరి.. ఏమైందంటే

సినిమా తారలు మరింత అందంగా కనిపించడం కోసం రకరకాల ప్రయోగాలు చేస్తూ ఉంటారు. ఎక్స్ట్రా గ్లామర్ టచ్ కోసం ఏవేవో సర్జరీలు చేయించుకుంటూ ఉంటారు. కొన్ని సార్లు అవి సక్సెస్ అవుతూ ఉంటాయి మరి కొన్ని సార్లు బెడిసిపోడుతూ ఉంటాయి.

Actress: బెడిసికొట్టిన సర్జరీ.. గుర్తుపట్టలేనంతగా మారిపోయిన సొగసరి.. ఏమైందంటే
Swathi
Follow us
Rajeev Rayala

|

Updated on: Jun 19, 2022 | 10:00 PM

సినిమా తారలు మరింత అందంగా కనిపించడం కోసం రకరకాల ప్రయోగాలు చేస్తూ ఉంటారు. ఎక్స్ట్రా గ్లామర్ టచ్ కోసం ఏవేవో సర్జరీలు చేయించుకుంటూ ఉంటారు. కొన్ని సార్లు అవి సక్సెస్ అవుతూ ఉంటాయి మరి కొన్ని సార్లు బెడిసిపోడుతూ ఉంటాయి. అలాగే బొద్దుగా ఉన్న భామలు సన్నగా అవ్వడానికి లైపో సర్జరీలు వంటివి చేయించుకుంటూ ఉంటారు. తాజాగా ఓ నటి చేయించుకున్న సర్జరీ విఫలం కావడంతో గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. ఆమెను చూసిన అందరూ షాక్ అవుతున్నారు. ఇంతకు ఆ నటి ఎవరు.? ఆమెకు ఏమైంది.? అంటే. కన్నడ నటి స్వాతి సతీష్ హీరోయిన్ గా పలు సినిమాల్లో నటించింది. ఈ అమ్మడు ఇటీవలే బెంగుళూరులోని ఓ ప్రయివేట్ దంత వైద్యశాలలో చికిత్స చేయించుకుంది.

అయితే ఆమె చేయించుకున్న సర్జరీ వికటించింది. హాస్పటల్‌లో చేరిన ఆమెకు రూట్‌ కెనాల్‌ థెరపీ  చేశారు డాక్టర్స్. అయితే ఆ సర్జరీ వికటించడంతో ముఖం అంతా వాచిపోయింది. రెండు మూడు రోజుల్లో తగ్గిపోతుందిలే అనుకుంటే అది ఇంతకు తగ్గడం లేదు. దాంతో ఆమె మొహం గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. అంతేకాకుండా తీవ్రమైన నొప్పితో బాధపడుతున్నట్లు స్వాతి చెప్పుకొచ్చింది. ముఖం వాచిపోవడంతో బయటకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడిందని.. ముఖం పాడవ్వడంతో తనకు వచ్చిన సినిమా అవకాశాలు వెనక్కి వెళ్లిపోయాయని ఆవేదన వ్యక్తం చేసింది స్వాతి. వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని.. అనస్థీషియాకు బదులు సాలిసిలిక్‌ యాసిడ్‌ ఇచ్చినట్లు తెలిపింది. ప్రస్తుతం ఆమె చికిత్సకోసం మరో హాస్పటల్ లో చేరింది. ప్రస్తుతం ఆమెకు చికిత్స చేస్తున్నారు వైద్యులు.

ఇవి కూడా చదవండి
Swathi Satheesh

మరిన్ని సినిమా వార్తలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి