Shruti Haasan: స్టార్ హీరో సినిమా షూటింగ్‌లో జాయిన్ అయిన శ్రుతి హాసన్.. ఇంతకు ఆ హీరో ఎవరంటే
విశ్వనటుడు కమల్ హాసన్ వారసురాలిగా చిత్రపరిశ్రమలోకి కథానాయికగా అరంగేట్రం చేసి.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది హీరోయిన్ శ్రుతి హాసన్ (Shruthi Haasan). తెలుగులో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి అగ్రకథానాయికగా దూసుకుపోతుంది.
Updated on: Jun 19, 2022 | 8:42 PM

విశ్వనటుడు కమల్ హాసన్ వారసురాలిగా చిత్రపరిశ్రమలోకి కథానాయికగా అరంగేట్రం చేసి.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది హీరోయిన్ శ్రుతి హాసన్ (Shruthi Haasan).

తెలుగులో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి అగ్రకథానాయికగా దూసుకుపోతుంది. మరోవైపు కోలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలలోనూ సత్తా చాటింది శ్రుతి.. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఈ ముద్దుగుమ్మ

ఇటీవల రవితేజ సరసన క్రాక్ సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ కావడంతో మళ్లీ ఫాంలోకి వచ్చేసింది ఈ ముద్దుగుమ్మ

ప్రస్తుతం బాలయ్య సరసన నటిస్తోంది. తాజాగా ఈ అమ్మడు ఓ స్టార్ హీరో సినిమా షూటింగ్ సెట్లో సందడి చేసింది.

ఇందుకు సంబంధించిన ఫోటోను డైరెక్టర్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేయడంతో నెట్టింట వైరల్ అవుతుంది.

మోస్ట్ టాలెంటెడ్ ఫెవరేట్ పర్సన్ శ్రుతి హాసన్ సెట్లో ఉంది అంటూ ఆమెతో కలిసి దిగిన ఫోటోను షేర్ చేశారు గోపీచంద్ మలినేని.




