Kajal Aggarwal: అందాల మిత్రవింద పుట్టిన రోజు నేడు.. కాజల్ గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా..
లక్ష్మీ కళ్యాణం సినిమాతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది కాజల్ అగర్వాల్.. ఆ తర్వాత చందమామ సినిమాతో సూపర్ హిట్ అందుకోవడమే కాకుండా.. తెలుగు ప్రేక్షకుల మనసులో స్థానాన్ని సంపాదించుకుంది. అతి తక్కువ సమయంలోనే దక్షిణాది ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లలో ఒకరిగా తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది కాజల్.. ఈరోజు (జూన్ 19న) కాజల్ పుట్టిన రోజు.