Father’s Day 2022: ఫాదర్స్ డే స్పెషల్.. తండ్రితో జ్ఞాపకాలను షేర్ చేసుకున్న సెలబ్రెటీస్.. నెట్టింట ఫోటోస్ వైరల్..

ఒక గొప్ప తనయుడిగా.. గర్వించే తండ్రిగా అందమైన అనుభూతిని ఆస్వాదిస్తున్నానంటూ మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ఫాదర్స్ డే సందర్భంగా తన తండ్రికి శుభాకాంక్షలు తెలుపుతూ ఆయనతో ఉన్న ఫోటోను షేర్ చేసుకున్నారు మెగాస్టార్..

Father's Day 2022: ఫాదర్స్ డే స్పెషల్.. తండ్రితో జ్ఞాపకాలను షేర్ చేసుకున్న సెలబ్రెటీస్.. నెట్టింట ఫోటోస్ వైరల్..
Fathers Day
Follow us
Rajitha Chanti

|

Updated on: Jun 19, 2022 | 1:27 PM

కోపాన్ని చూపిస్తూనే సరైన దారిలో తమ పిల్లల జీవితాలు సాగాలని ఆకాంక్షించేవారే నాన్న.. తన పిల్లల భవిష్యత్తు కోసం ఎన్నో సవాళ్లను ఎదుర్కొని.. ఉన్నత స్థాయికి చేరిన పిల్లలను చూసి తన జీవితంలోని ఒడిదుడుకులను మర్చిపోతాడు.. కుటుంబం, బాధ్యతలు, పిల్లల చదువులు, వారికి కావాల్సిన సౌకర్యాలు సమకూర్చడంలో అలుపులేని బాటసారి నాన్నే.. అమ్మది నమ్మకం.. నాన్నది కోపం.. నమ్మకం ధైర్యాన్ని ఇస్తే.. నాన్న కోపం జీవితంపై గెలవాలని ఆలోచన కలిగిస్తుంది. పిల్లల భవిష్యత్తు కోసం జీవితాంతం పోరాడే నిస్వార్థ శ్రామికుడు నాన్న… జూన్ 19న ఫాదర్స్ డే.. ఈ సందర్భంగా తమ తండ్రులకు శుభాకాంక్షలు తెలుపుతూ వారితో దిగిన ఫోటోలను షేర్ చేసుకుంటున్నారు టాలీవుడ్ స్టార్స్..

ఒక గొప్ప తనయుడిగా.. గర్వించే తండ్రిగా అందమైన అనుభూతిని ఆస్వాదిస్తున్నానంటూ మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ఫాదర్స్ డే సందర్భంగా తన తండ్రికి శుభాకాంక్షలు తెలుపుతూ ఆయనతో ఉన్న ఫోటోను షేర్ చేసుకున్నారు మెగాస్టార్..

ఇవి కూడా చదవండి

మీరు లేకపోతే నేను ఈ స్థాయిలో ఉండేవాడిని కాదు.. నాన్నా అనే పదానికి అసలైన నిర్వచనం మీరే.. హ్యాప్పీ ఫాదర్స్ డే నాన్నా అంటూ మహేష్ తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణకు శుభాకాంక్షలు తెలిపారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.