Sai Pallavi: ఆ సమయంలో గుండె బరువెక్కింది.. కన్నీళ్లు వచ్చేశాయి.. సాయి పల్లవి ఎమోషనల్ కామెంట్స్..

డైరెక్టర్ వేణు ఉడుగుల తెరకెక్కించిన ఈ సినిమాలో రానా దగ్గుబాటి హీరోగా నటించగా.. ప్రియమణి, నవీన్ చంద్ర, నివేదా పేతురాజ్, ఈశ్వరీ కీలకపాత్రలలో నటించారు. 1990లో సరళ అనే మహిళ జీవితంలో జరిగిన యాదార్థ

Sai Pallavi: ఆ సమయంలో గుండె బరువెక్కింది.. కన్నీళ్లు వచ్చేశాయి.. సాయి పల్లవి ఎమోషనల్ కామెంట్స్..
Sai Pallavi
Follow us
Rajitha Chanti

|

Updated on: Jun 19, 2022 | 10:34 AM

సరళ గారి కుటుంబాన్ని చూసిన తర్వాత గుండె బరువెక్కింది. కన్నీళ్లు వచ్చాయి. గొప్ప మనసు వున్న వాళ్ళు మళ్ళీ పుడతారు, వాళ్ళు ఏం అనుకున్నారో ఇంకో మార్గంలో సాధించుకుంటారని అన్నారు న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి (Sai Pallavi.. ఆమె ప్రధాన పాత్రలో నటించిన విరాట పర్వం బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ వేణు ఉడుగుల తెరకెక్కించిన ఈ సినిమాలో రానా దగ్గుబాటి హీరోగా నటించగా.. ప్రియమణి, నవీన్ చంద్ర, నివేదా పేతురాజ్, ఈశ్వరీ కీలకపాత్రలలో నటించారు. 1990లో సరళ అనే మహిళ జీవితంలో జరిగిన యాదార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. జూన్ 17న విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ క్రమంలో శనివారం నిర్వహించిన విరాటపర్వం సక్సెస్ మీట్ లో పాల్గోన్న సాయి పల్లవి తాను పోషించిన పాత్ర గురించి ఎమోషనల్ కామెంట్స్ చేశారు..

ఈ సందర్భంగా హీరోయిన్ “సరళ గారి అన్నయ్య మోహన్ రావు గారికి ధన్యవాదాలు. వారి ఇంటికి వెళ్లి కలసినపుడు నన్ను ఆశీర్వదించి చీర బొట్టు పెట్టి దీవించారు. సరళ గారి కుటుంబాన్ని చూసిన తర్వాత గుండె బరువెక్కింది. కన్నీళ్లు వచ్చాయి. గొప్ప మనసు వున్న వాళ్ళు మళ్ళీ పుడతారు, వాళ్ళు ఏం అనుకున్నారో ఇంకో మార్గంలో సాధించుకుంటారని చెప్పా. ఈ రోజు మోహన్ రావు గారు ఇక్కడి వచ్చి సినిమా విజయాన్ని ప్రేక్షకులతో పంచుకోవడం ఆనందంగా వుంది. సురేష్ బాబు గారు ఒక ఎన్సైక్లోపీడియా. ఆయన దగ్గర చాలా నేర్చుకున్నా. వెన్నెల పాత్ర పోషించినందుకు చాలా గర్వంగా ఫీలౌతున్నా. ప్రేక్షకులు సినిమాని మళ్ళీ మళ్ళీ చూస్తున్నామని, చూసిన ప్రతీ సారి ఇంకా గొప్పగా అనిపిస్తుందని చెప్పడం ఆనందంగా వుంది. సినిమాని ఆదరించిన ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు. ఈ సినిమాని మళ్ళీ మళ్ళీ చూడండి. చూసిన ప్రతీ సారి కొత్త అనుభూతిని పొందుతారు” అన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.