Viral News: అరె ఏంట్రా ఇది.. రిసిగ్నేషన్‌కు మనోడు చెప్పిన కారణం తెలిస్తే విస్తుపోతారు..
Viral News: ఈ లేఖను స్వయంగా ప్రముఖ వాణిజ్యవేత్త హర్ష గొయెంకా తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు.ఈ లేఖ చిన్నది.. కానీ చాలా లోతైనది అని క్యాప్షన్‌లో రాశారు.
Viral Resignation Letter: సోషల్ మీడియాలో ఎప్పుడు ఏ ఫోటో.. ఏ వీడియో వైరల్ అవుతుందో ముందే ఊహించడం కష్టం. తాజాగా సోషల్ మీడియాలో ఓ విచిత్రమైన రాజీనామా లేఖ ఫోటో వైరల్ అవుతోంది. ఎవరైనా తన ఉద్యోగానికి రాజీనామా చేస్తే.. తనకు బాస్‌తో లేదా కంపెనీతో ఉన్న అనుబంధం గురించి గుర్తుచేసుకుంటారు. కంపెనీ లేదా సహచరులు ఇచ్చిన ప్రోత్సాహం గురించి లేఖలో ఎమోషనల్ అవుతారు. ఏదైనా ఇబ్బందికర పరిస్థితుల్లో రాజీనామా చేయాల్సి వస్తే.. ఆ సమస్య గురించి చెప్పుకుంటారు. అయితే ఓ వ్యక్తి తన కంపెనీకి సమర్పించిన రాజీనామా లేఖలో సృజనాత్మకతను ప్రదర్శించాడు. తన యజమానికి పంపిన రిసిగ్నేషన్ లెటర్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో ఈ రిసిగ్నేషన్ లెటర్‌పై జోరుగా చర్చ జరుగుతోంది. ఇంతకీ ఆ వ్యక్తి తన రిసిగ్నేషన్ లెటర్‌లో ఏమి రాశాడో మీరూ తెలుసుకోండి.
అందరిలా ఆ ఉద్యోగి తన రిసిగ్నేషన్ లెటర్‌లో యజమానికి లేదా కంపెనీతో తనకున్న అనుబంధాల గురించి ఏమీ ప్రస్తావించలేదు. కేవలం సూటిగా.. సుత్తి లేకుండా మూడు ముక్కల్లో ఫలానా కారణంతో రాజీనామా చేస్తున్నట్లు కుండబద్ధలు కొట్టేశాడు. మజా రానందున ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్లు రాజేష్ అనే వ్యక్తి అందులో పేర్కొన్నాడు.
ఈ లేఖను స్వయంగా ప్రముఖ వాణిజ్యవేత్త హర్ష గొయెంకా తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు.ఈ లేఖ చిన్నది.. కానీ చాలా లోతైనది అని క్యాప్షన్‌లో రాశారు. ఉద్యోగంలో మజా లేనందున రాజీనామా చేయడాన్ని ప్రస్తావిస్తూ.. ఇది మనమందరం పరిష్కరించాల్సిన తీవ్రమైన సమస్యగా పేర్కొన్నారు. సోషల్ మీడియాలో ఈ లేఖ వైరల్ కావడంతో.. విచిత్ర రిసిగ్నేషన్ లెటర్‌పై నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తున్నారు.
This letter is short but very deep. A serious problem that we all need to solve… pic.twitter.com/B35ig45Hhs
— Harsh Goenka (@hvgoenka) June 19, 2022
ఇంతకు ముందు కూడా, అనేక విచిత్రమైన రిసిగ్నేషన్ లెటర్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇటీవల ఓ రాజీనామా లేఖ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందులో వ్యక్తి కేవలం మూడు మాటలలో తన రాజీనామాను సమర్పించారు. బై బై సార్.. అంటూ రిసిగ్నేషన్ లెటర్ పూర్తి చేశాడు. మరో కంపెనీలో ఇంటర్వ్యూ ఉన్నందున తనకు ఇవాళ సెలవు కావాలంటూ ఓ వ్యక్తి పంపిన లీవ్ లెటర్ కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది.
Simple. pic.twitter.com/JLGkqzVbP2
— Maphanga Mbuso (@MBSVUDU) June 12, 2022
మరిన్ని ట్రెండింగ్ వార్తలు చదవండి..