Bear Attack: ఎలుగుబంటి దాడి నుండి ఎలా బయటపడాలి..? ఒక వేళ దాడి చేస్తే ఏం చేయాలి..?
ప్రస్తుత కాలంలో అడవి మృగాలపై చాలామందికి అవగాహన లోపించింది. దీంతో అవి దాడి చేస్తే ఏం చేయాలనేది ఎవరికీ అంతుబట్టకుండా ఉంది. అయితే ఎలుగుబండి దాడి చేస్తే ఏం చేయాలి?
ఎలుగుబంటి దాడి చేస్తే ఏం చేయాలి? ఏం చేయాలో చాలామందికి తెలియదు. రెండు మూడు దశాబ్దాల క్రితం అడవి మృగాలను రక్షించుకునేందుకు అనేక ఉపాయాలను ఉపయోగించేవారు. కాని రాను రాను అడవి మృగాలపై చాలామందికి అవగాహన లోపించింది. దీంతో అవి దాడి చేస్తే ఏం చేయాలనేది ఎవరికీ అంతుబట్టకుండా ఉంది. అయితే ఎలుగుబండి దాడి చేస్తే ఏం చేయాలి?
అడవుల్లోకి వెళ్లేవారు.. అక్కడ ఏయే క్రూరమృగాలున్నాయో తెలుసుకోవాలి. ఎలుగుబంటి లాంటి వైల్డ్ యానిమల్ ఉంటే.. అందుకు తగ్గ సరంజామాను ముందే తీసుకెళ్లాలి. అందులో మొదటిది బేర్ స్ప్రే. ఇది ఎలుగుబంట్లపై సమర్థవంతంగా పనిచేస్తుంది. ఆడవారు పెప్పర్‌స్ప్రే ఉపయోగించినట్లే.. అడవుల్లో బేర్ స్ప్రే ఉపయోగించాలి. మరి బేర్ స్ప్రే లేకపోతే ఏం చేయాలి? భల్లూకం చుట్టుపక్కల ఉన్నట్లు తెలిస్తే వెంటనే భూమ్మీద పడుకోవాలి. చనిపోయినట్లు నటించాలి. ముఖ్యంగా ముహం, మెడ, పొట్టను కవర్ చేసుకోవాలి. ఎలుగుబంటికి ఎలాంటి థ్రెట్ లేదని తెలిస్తే అదే వెళ్లిపోతుంది. కాని మనకు సహనం అవసరం. చనిపోయినట్లు నటించడమే కాదు.. ఓ పదిహేను 20 నిమిషాల వరకు అలానే ఉండడం అత్యుత్తమం.
అడవి మార్గాల్లో వెళ్లే సమయంలో ఎలుగుబంటి కనిపిస్తే.. నిల్చున్న చోట అలానే ఉండిపోవడం అత్యుత్తమం. కదలకుండా ఉంటే.. ఎలుగు వెళ్లిపోతుంది. అసలు ఎలుగు ఎందుకు దాడి చేస్తుంది. ఆకలితో కడుపు కాలినపుడు.. తనకుగాని.. తన పిల్లలకు గాని ప్రాణహాని ఉందనుకున్నపుడు ఎలుగు దాడికి దిగుతుంది. మనుషుల్ని చంపుతుంది. అయితే ప్రపంచవ్యాప్తంగా ఎలుగుబంటి దాడులు చాలా తక్కువ. ఏడాదికి ప్రపంచవ్యాప్తంగా ఎలుగు దాడి ఘటనలు 40కి మించి నమోదవడంలేదు. అంటే ఎలుగు ప్రమాదకారి కాదు. అనవసరంగా దాడి చేయదు. దానికి ప్రాణహాని ఉందని తెలిస్తే మాత్రం వదలదు. మరి శ్రీకాకుళం జిల్లా ఘటనలో దాడి వెనుక ఏం జరిగిందో తెలియాలి.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి