AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: వారు తొక్కితే రోగాలన్నీ మటుమాయం..! కాలి స్పర్శ తగిలితే సంతాన భాగ్యం..!

శ్రీ సత్యసాయి జిల్లాలోని మడకశిరలో జరిగే భూతప్పల ఉత్సవం ప్రత్యేక ఆచారాలతో ఆకట్టుకుంటోంది. దైవస్వరూపులుగా భావించే భూతప్పల కాలి స్పర్శ తగిలితే దీర్ఘకాలిక రోగాలు నయమవుతాయనీ, సంతానం లేని వారికి సంతానం కలుగుతుందనీ స్థానికుల విశ్వాసం. అందుకే తడి బట్టలతో భక్తులు భూతప్పలు నడిచే దారిలో పొర్లు దండాలు పెట్టి బోర్లా పడుకుంటారు.

Andhra: వారు తొక్కితే రోగాలన్నీ మటుమాయం..! కాలి స్పర్శ తగిలితే సంతాన భాగ్యం..!
Bhoothappa Festival
Nalluri Naresh
| Edited By: Ram Naramaneni|

Updated on: Dec 05, 2025 | 5:54 PM

Share

దైవ స్వరూపులుగా పిలవబడే వాళ్ల కాలి స్పర్శ తగిలితే దీర్ఘకాలిక రోగాలు నయమవుతాయట. అలాగే సంతానం లేని వారికి సంతానం కలుగుతుందట. శ్రీ సత్య సాయి జిల్లా మడకశిరలో జరిగే భూతప్పల ఉత్సవంలో…. ఓ వింత ఆచారం అందరిని ఆకట్టుకుంటుంది… తడి బట్టలతో భూతప్పలు నడిచే మార్గంలో పొర్లుదండాలు పెట్టి పడుకుంటే వారి కాలి స్పర్శతో సమస్యలు తీరుతాయని అక్కడి ప్రజల విశ్వాసం… ఈ భూతప్పల ఉత్సవంలో పాల్గొనందుకు వేలాదిగా జనం తరలివస్తారు. ఒక చేత్తో కత్తి పట్టుకుని… మరో చేత్తో కవచం పట్టుకొని భీకరమైన రూపంలో కనిపిస్తారు ఈ భూతప్పలు. వీరిని మడకశిర చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు దైవ స్వరూపులుగా భావిస్తారు.

మడకశిర మండలంలోని భక్తరహళ్లి శ్రీ లక్ష్మీనరసింహస్వామి, జిల్లేడు గుంట ఆంజనేయ స్వాముల బ్రహ్మోత్సవాలలో ప్రతి సంవత్సరం ఈ భూతప్పలు దర్శనమిస్తారు. వందల ఏళ్ల నుంచి ఈ భూతప్పల ఉత్సవం జరుగుతుంది. వారం రోజులు పాటు జరిగే ఈ బ్రహ్మోత్సవాల్లో భూతప్పల ఉత్సవం ప్రత్యేక ఆకర్షణ ప్రాధాన్యత సంతరించుకుంది. భక్తులు తమ మొక్కులు చెల్లించుకున్న తర్వాత.. జరిగే తంతే అందరికీ ఒక వింత ఆచారంగా కనిపిస్తుంది. లక్ష్మీనరసింహస్వామి, ఆంజనేయస్వామి ఉత్సవ విగ్రహాలను పూలతో అందంగా అలంకరించి ఊరేగింపుగా తీసుకొస్తారు. స్వామి ఉత్సవ విగ్రహాల ముందు కత్తి కవచం చేత పట్టుకుని ఒక వింత వేషధారణలో వచ్చే వాళ్లే ఈ భూతప్పలు…. డప్పు వాయిద్యాలకు కత్తి కవచంతో నాట్యం చేస్తూ… ఆహాకారాలు చేస్తూ… విచిత్రంగా ఉంటారు. మరోవైపు ఉపవాస దీక్షతో…. తడి బట్టలతో భక్తులు భూతప్పలు వచ్చే దారిలో పొర్లు దండాలు పెట్టి పడుకుని ఉంటారు. భూతప్పల ఖాళీ స్పర్శ కోసం వేలాది భక్తులు వేచి ఉంటారు. అలా బోర్లా పడుకున్న భక్తులను భూతప్పలు తొక్కుకుంటూ వారిపై నడుస్తూ ముందుకు సాగుతారు. భూతప్పలు అలా నడిచి వచ్చేటప్పుడు వారిని దైవ స్వరూపులుగా భక్తులు భావిస్తారని…. భూతప్పల కాలి స్పర్శ తగిలితే కోరిన కోరికలు నెరవేరుతాయిని.. దీర్ఘకాలిక రోగాలు… సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని. చిన్నపిల్లలు, మహిళలు, వృద్ధులని తేడా లేకుండా భూతప్పల కాలి స్పర్శ కోసం వారు నడిచే దారిలో బోర్లా పడుకుని ఉంటారు. మడకశిర చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు కర్ణాటకలో చాలామంది భక్తులు ఇక్కడికి వస్తారు. ఉత్సవంలో వేలాదిగా పాల్గొంటారు… టెక్నాలజీ ఎంత పెరిగినా.. భూతప్పల కాలి స్పర్శ కోసం భక్తులు పొల్లు దండాలు పెట్టడం ఏంటని… ఇది మూఢనమ్మకం అని వాదించేవారు ఉంటే.. కాదు, కాదు వందల సంవత్సరాలుగా తమ పూర్వీకులు నుంచి వస్తున్న సాంప్రదాయం, భక్తి అంటున్నారు భూతప్ప ఉత్సవాల్లో పాల్గొనే భక్తులు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి.