Trending video: పిల్లిని కాపాడేందుకు బుడ్డొడి ఐడియా అదుర్స్‌..! అందరూ అలా చూస్తుండిపోయారు..

జంతువుల పట్ల ప్రజల ప్రేమ,అప్యాయత, శ్రద్ధ చూపించేవారు సైతం చాలా మందే ఉంటున్నారు. ఇటీవల కాలంలో అలాంటి వారు మూగజీవాల పట్ల చూపించే మానత్వం తరచూ వెలుగులోకి వస్తుంది.

Trending video: పిల్లిని కాపాడేందుకు బుడ్డొడి ఐడియా అదుర్స్‌..!  అందరూ అలా చూస్తుండిపోయారు..
Trending Video
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 20, 2022 | 8:06 PM

ఈ రోజుల్లో ప్రజలంతా ఎవరి పనుల్లో వారు చాలా బిజీగా ఉన్నారు. ఏ మనిషి, ఇతర ఏ జీవుల గురించి ఆలోచించేటంత సమయం, ఓర్పులు లేకుండా పోయింది. అయితే అందరూ అలా ఉండరు. జంతువుల పట్ల ప్రజల ప్రేమ,అప్యాయత, శ్రద్ధ చూపించేవారు సైతం చాలా మందే ఉంటున్నారు. ఇటీవల కాలంలో అలాంటి వారు మూగజీవాల పట్ల చూపించే మానత్వం తరచూ వెలుగులోకి వస్తుంది. సోషల్ మీడియాలో అలాంటి వారికి సంబంధించిన వీడియోలు తరచూగా వైరల్‌ అవుతుంటాయి. అలాంటి ఒక వీడియో తాజాగా ఇంటర్‌నెట్‌లో హల్‌చల్‌ చేస్తోంది. ఆ వీడియో చూస్తే ఫిదా అవాల్సిందే..

వైరల్‌ అవుతున్న వీడియోలో… ఒక చిన్న పిల్లవాడు పిల్లికి సహాయం చేస్తున్నట్లుగా కనిపిస్తుంది. ఈ పిల్లి ఓ ఎత్తైన గోడపై ఉంది..అక్కడ నుండి ఆ పిల్లి కిందకు దిగేందుకు అవస్థపడుతోంది. పాపం పిల్లి కిందకు దూకలేనంత ఎత్తుగా ఉంది ఆ గోడ.. పిల్లి నిస్సహాయతను చూసి ఒక చిన్న పిల్లవాడు చలించిపోయాడు. దానికి సహాయం చేయడం కోసం ముందుకు వచ్చాడు. బాలుడు చిన్నవాడు, పిల్లి ఉన్న గోడ ఎంతో ఎత్తులో ఉంది..దాంతో అతడు ఓ ప్లాన్‌ చేశాడు..సమీపంలో కనిపించిన ఒక త్రిభుజం ఆకారంలో ఉన్న స్టాపర్‌ని తన చేతితో పైకి లేపి, పిల్లిని దానిపైకి రమ్మని అడుగుతున్నాడు.. కానీ పిల్లి దాని మీద ఎక్కడానికి భయపడుతోంది. బాలుడు తనను పట్టుకోలేడేమోనని ఆ పిల్లి సందేహపడుతున్నట్టుగా ఉంది. బాలుడు ఎంత ప్రయత్నించినా ఆ పిల్లి కిందకు దిగలేదు. ఇక లాభం లేదు అనుకున్న ఆ బుడ్డొడికి మరో ఐడియా వచ్చింది. ఒక పెద్ద పెట్టెను తీసుకువచ్చాడు. దాన్ని పిల్లికి ఎదురుగా పెట్టి రమ్మని పిలిచినట్టుగా చెప్పాడు. అందుకు పిల్లి ఆ పెట్టెలోపలికి దూకింది. దాంతో బాలుడు తన తలపై పెట్టెను జాగ్రత్తగా ఎత్తి కిందకు దించాడు. అలా పిల్లి గోడదిగొచ్చింది.

వీడియోలో బాలుడి ధైర్యం, ఏకాగ్రత చూసి అందరూ షాక్ అవుతున్నారు. ఈ వీడియో పోస్ట్ చేసిన వెంటనే వైరల్‌గా మారింది.  వీడియో చూసిన నెటిజన్లు తమదైన స్టైల్లో కామెంట్స్‌ చేస్తున్నారు. బాలుడి ఔదర్యాన్ని ఎంతగానో ప్రశంసిస్తున్నారు. చిన్నవాడైన ఎంతో గొప్ప మనసు చాటుకున్నాడని చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్‌ అవుతోంది.  ఇప్పటి వరకు దీనిని సుమారు 15 మిలియన్ల మంది (15M వీక్షణలు) వీక్షించారు. 92K వినియోగదారులు కూడా వీడియోను లైక్ చేసారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి