Viral Video: నీటి అడుగున నల్లటి ఆకారం.. ఏంటని చూడగా మైండ్ బ్లాంక్!
సరైన స్పాట్ ఎంచుకుని చేపల కోసం గాలం వెయ్యాలని భావించారు. అందుకోసం బోట్‌ను ముందుకు పోనిచ్చారు...
ఓ ఇద్దరు వ్యక్తులు తమ బోట్‌లో సముద్రంలోకి ఫిషింగ్‌కు వెళ్లారు. బోలెడన్ని చేపలు పట్టాలనుకున్నారు. సరైన స్పాట్ ఎంచుకుని చేపల కోసం గాలం వెయ్యాలని భావించారు. అందుకోసం బోట్‌ను ముందుకు పోనిచ్చారు. అయితే వారికి అనూహ్యంగా పక్కనే నీటి అడుగున ఓ నల్లటి ఆకారం ఈదుతూ కనిపించింది. అదేంటా అని చూడగా వారి ఫ్యూజులు ఎగిరిపోయాయి. అదేంటో తెలుసుకుందాం….
వివరాల్లోకి వెళ్తే.. అమెరికాలోని పలు ప్రాంతాల్లో నివసించే ప్రజలు సమ్మర్‌లో చేపల వేటకు వెళ్తుంటారు. ఈ క్రమంలోనే ఇద్దరు వ్యక్తులు తమ బోట్‌లో సముద్రంలోకి ఫిషింగ్‌కు వెళ్లారు. చేపల కోసం గాలం వేస్తుండగా వాళ్లకు నీటి అడుగున ఓ నల్లటి ఆకారం కనిపించింది. పొడవాటి షార్ప్ తోకతో.. చేపలా చకచకగా ఈదుకుంటూ వెళ్తోంది. ఏంటా అని చూడగా అది సొరచేప అని తెలిసి షాక్ అయ్యారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
View this post on Instagram
కాగా, థ్రెషర్ సొరచేపలు అలోపిడే జాతికి చెందినవి. ఇవి మనుషులకు ఎలాంటి హాని చేయవు. ఈ సొరచేపలు ఎక్కువగా నార్త్ అమెరికా, నార్త్ పసిఫిక్‌లోని ఆసియా ప్రాంతాల్లో కనిపిస్తాయి.