MS Dhoni: ‘కోచ్’ పుట్టినరోజున ఖరీదైన బహుమతి ఇచ్చిన ఎంఎస్ ధోనీ.. ధర ఎంతో తెలుసా?
ఖాదీ కుర్తా, జీన్స్ ధరించిన ధోనీ తన టెన్నిస్ భాగస్వామి, స్నేహితుడు సురేంద్ర కాకా పుట్టినరోజులో సందడి చేసి, ఖరీదైన బహుమతిని అందించాడు.
ఎంఎస్ ధోని ప్రస్తుతం క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. రాంచీలో కుటుంబంతో సరదాగా గడుపుతున్నాడు. అదే సమయంలో తన పాత స్నేహితులతో పాటు బంధువులను కలుసకుంటూ హ్యాపీగా ఉన్నాడు. ఈ క్రమంలోనే భారత మాజీ టెన్నిస్ ఆటగాడు, కోచ్ అయిన సురేంద్ర కుమార్ కాకా పుట్టినరోజులో పాల్గొని సందడి చేశాడు. సురేంద్ర కాకా మిస్టర్ కూల్‌కి స్నేహితుడే కావడంతో బర్త్‌డే పార్టీకి హజరయ్యాడు. ఖాదీ కుర్తా, జీన్స్ ధరించి, ధోని తన టెన్నిస్ భాగస్వామి స్నేహితుడు సురేంద్ర కాకా పుట్టినరోజుకు హాజరై, తన కుటుంబంతో కలిసి సరదాగా గడిపాడు. ఈ సమయంలో ఎంఎస్ ధోని, అతనికి పుట్టినరోజు బహుమతిగా ఖరీదైన బూట్లు ఇచ్చాడు.
సురేంద్ర కాకా పుట్టినరోజు వేడుకలో ధోనీతో పాటు జార్ఖండ్ క్రికెట్ సెక్రటరీ అమితాబ్ చౌదరి కూడా పాల్గొన్నారు. కేక్ కట్‌తో పుట్టినరోజు వేడుకలు ప్రారంభమయ్యాయి. సురేంద్ర కాకా కేక్ కట్ చేశారు. అనంతరం ధోనీ కేక్ నుంచి ఒక ముక్క తీసి సురేంద్ర కాకాకు తినిపించాడు.
ధోనీతో ఫోటో సెషన్..
కేక్ కట్ చేసి రుచి చూసిన తర్వాత ఫోటో సెషన్ కూడా జరిగింది. ధోనీతో ఫోటో దిగేందుకు అంతా ఆసక్తి చూపించారు. మహి కూడా ఎవరినీ నిరాశపరచలేదు. అందరితో ఫొటోలు దిగాడు.
‘కోచ్’కి బహుమతిగా బూట్లు..
తన టెన్నిస్ భాగస్వామి, కోచ్ పుట్టినరోజు వేడుకలకు ధోని ఖరీదైన గిఫ్ట్‌తో హాజరయ్యాడు. ధోనీ బహుమతిగా ఇచ్చిన షూస్ మార్కెట్ ధర రూ.13000. ధోనీ విషయానికొస్తే IPL 2022లో చెన్నై సూపర్ కింగ్స్ ప్రయాణం అంతగా ఆకట్టుకోలేక, లీగ్ నుంచే తప్పుకుంది. వచ్చే ఏడాది జరిగే ఐపీఎల్ సీజన్‌తో ధోనీ ప్రయాణం కూడా ముగుస్తుందని అంటున్నారు.
View this post on Instagram
View this post on Instagram