AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: రంజీ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో సెంచరీ ఇన్నింగ్స్.. ఏడ్చేసిన బ్యాట్స్‌మెన్..

ఈ సీజన్‌లో 133.85 సగటుతో 937 పరుగులు చేశాడు. కనీసం 2000 ఫస్ట్ క్లాస్ పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌లలో అతని సగటు 82గా నిలిచింది. సర్ఫరాజ్ ఖాన్ సరసన డాన్ బ్రాడ్‌మన్ మాత్రమే ఉండడం విశేషం.

Watch Video: రంజీ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో సెంచరీ ఇన్నింగ్స్.. ఏడ్చేసిన బ్యాట్స్‌మెన్..
Ranji Trophy Sarfaraz Khan
Venkata Chari
|

Updated on: Jun 23, 2022 | 4:11 PM

Share

రంజీ ట్రోఫీలో ముంబై బ్యాట్స్‌మెన్ సర్ఫరాజ్ ఖాన్ అద్భుతమైన ఫామ్‌తో దూసుకపోతున్నాడు. మధ్యప్రదేశ్‌తో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌లో ఈ సీజన్‌లో ఈ ఆటగాడు నాలుగో సెంచరీ సాధించాడు. సెంచరీ చేసిన తర్వాత సర్ఫరాజ్ తీవ్ర భావోద్వేగానికి గురై ఏడవడం మొదలుపెట్టాడు. ఈ వీడియోను బీసీసీఐ నెట్టింట్లో షేర్ చేసింది. అలాగే ఇటీవలే ప్రపంచానికి వీడ్కోలు పలికిన పంజాబీ గాయకుడు సిద్ధూ ముసేవాలాకు కూడా అతను తన సంతకం స్టెప్ వేసి నివాళులర్పించాడు. ఈ సందర్భంగా సర్ఫరాజ్ ఖాన్ చాలా ఎమోషనల్‌గా కనిపించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ మ్యాచ్‌లో సర్ఫరాజ్ బ్యాట్ 243 బంతుల్లో 134 పరుగులు చేసింది. ఈ క్రమంలో అతను 13 ఫోర్లు, 2 సిక్సర్లు బాదాడు. ముంబై మొత్తం ఇన్నింగ్స్ 374 పరుగుల వద్ద ముగిసింది. ముంబైకి సర్ఫరాజ్‌తో పాటు యశస్వి జైస్వాల్ 78, పృథ్వీ షా 47 పరుగులు చేసి, ఆకట్టుకున్నారు.

ఇవి కూడా చదవండి

130 కంటే ఎక్కువ సగటుతో పరుగులు..

రంజీ ట్రోఫీ చివరి సీజన్‌లో సర్ఫ్రరాజ్ 9 ఇన్నింగ్స్‌ల్లో 928 పరుగులు చేశాడు. అదే సమయంలో ఈ సీజన్‌లో 133.85 సగటుతో 937 పరుగులు చేశాడు. కనీసం 2000 ఫస్ట్ క్లాస్ పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌లలో అతని సగటు 82గా నిలిచింది. సర్ఫరాజ్ ఖాన్ సరసన డాన్ బ్రాడ్‌మన్ మాత్రమే ఉండడం విశేషం.

ఫైనల్‌కు ముందు సర్ఫరాజ్ ఖాన్ బ్యాట్ 275, 63, 48, 165, 153, 40, 59 నాటౌట్‌గా నిలిచాడు. గురువారం 248/5తో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన ముంబై 126 పరుగులు జోడించి 5 వికెట్లు కోల్పోయింది.

మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!
అందంలో తల్లిని మించిపోయిందిగా..
అందంలో తల్లిని మించిపోయిందిగా..