Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: 4 బంతుల్లో 3 వికెట్లు తీసి హీరో అయ్యాడు.. చివరి బాల్‌కు మాత్రం విలన్‌గా మారిన బౌలర్.. చివరి ఓవర్‌లో ట్విస్ట్..

ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో సోమర్‌సెట్ 3 వికెట్ల తేడాతో సర్రేపై విజయం సాధించింది. పీటర్ సిడిల్ వేసిన చివరి బంతికి ఫోర్ కొట్టి సోమర్‌సెట్‌కు మాకర్ విజయాన్ని అందించాడు.

Video: 4 బంతుల్లో 3 వికెట్లు తీసి హీరో అయ్యాడు.. చివరి బాల్‌కు మాత్రం విలన్‌గా మారిన బౌలర్.. చివరి ఓవర్‌లో ట్విస్ట్..
Somerset Vs Surrey, Vitality Blast
Follow us
Venkata Chari

|

Updated on: Jun 22, 2022 | 1:19 PM

ఇంగ్లండ్‌లో జరుగుతున్న టీ20 బ్లాస్ట్ పోటీలో, ప్రతిరోజూ ఒకటి కంటే ఎక్కువ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. మంగళవారం కూడా అలాంటిదే కనిపించింది. ఓవల్‌లో జరిగిన సౌత్ గ్రూప్ మ్యాచ్‌లో సర్రే 3 వికెట్ల తేడాతో సోమర్‌సెట్‌ను ఓడించింది. ఆఖరి బంతికి మ్యాచ్‌ ఖరారు అయింది. మ్యాచ్ చివరి ఓవర్లో ఫలితం రెండుసార్లు దోబూచులాడింది. అంతకుముందు ఈ మ్యాచ్ సోమర్‌సెట్ వైపు సాగుతున్నట్లు కనిపించినా చివరికి సర్రే గెలిచింది. సోమర్‌సెట్‌ తరపున ఆడుతున్న ఫాస్ట్ బౌలర్ పీటర్ సిడిల్ ఈ మ్యాచ్‌లో హీరో అనిపించుకున్నప్పటికీ, చివరి బంతికి అతను తన జట్టుకు విలన్‌గా నిరూపించుకున్నాడు.

చివరి ఓవర్ థ్రిల్..

ఇవి కూడా చదవండి

సర్రే 145 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. చివరి ఓవర్లో 9 పరుగులు చేయాల్సి ఉండగా, చేతిలో 6 వికెట్లు మిగిలి ఉండటంతో మ్యాచ్ వారి చేతుల్లోనే ఉంది. కానీ, సోమర్సెట్ ఫాస్ట్ బౌలర్ పీటర్ సిడిల్ ఐదు బంతుల్లో 3 వికెట్లు పడగొట్టి మ్యాచ్‌ను పూర్తిగా మార్చేశాడు. కానీ, చివరి బంతికి అతను చేసిన పొరపాటు సర్రే మ్యాచ్‌ను గెలిచేలా చేసింది. చివరి ఓవర్‌లో ఏం జరిగిందో ఓసారి చూద్దాం..

తొలి బంతి – పీటర్ సిడిల్ వేసిన తొలి బంతికి విల్ జాక్వెస్ ఒక పరుగు తీశాడు.

రెండో బంతి: పీటర్ సిడిల్ రెండో బంతికే క్రిస్ జోర్డాన్‌కు పెవిలియన్ దారి చూపించాడు. ఈ బ్యాట్స్‌మెన్ 14 పరుగులు చేసిన తర్వాత ఔటయ్యాడు.

మూడో బంతి: రీఫర్ మొదటి బంతికే ఫోర్ కొట్టి మ్యాచ్‌ని సర్రే వైపు మళ్లించాడు. ఆ తర్వాత సర్రే చివరి 3 బంతుల్లో 4 పరుగులు మాత్రమే చేయాల్సి వచ్చింది.

నాల్గవ బంతి – పీటర్ సిడిల్ నాల్గవ బంతికి రీఫర్ బౌల్డ్ చేసి, మరోసారి మ్యాచ్‌ని సోమర్‌సెట్ వైపు తిప్పాడు.

ఐదవ బంతి – పీటర్ సిడిల్ బ్యాటర్ గస్ అట్కిన్సన్‌ను బౌల్డ్ చేశాడు. దీంతో మ్యాచ్‌లో సర్రే ఓడిపోతుందని అనిపించింది.

ఆరో బంతి – చివరి బంతికి సర్రే నాలుగు పరుగులు చేయాల్సి ఉండగా మెక్‌కర్ స్ట్రైక్‌లో ఉన్నాడు. సిడిల్ కూడా చివరి బంతికి యార్కర్ వేయడానికి ప్రయత్నించాడు. అయితే ఈ సమయంలో బంతి ఓవర్ పిచ్ అయింది. బ్యాట్స్‌మెన్ కవర్స్ వైపు ఫోర్ కొట్టడం ద్వారా సోమర్సెట్ నుంచి మ్యాచ్‌ను లాగేసుకున్నాడు.

విల్ జాక్వెస్ అద్భుతమైన ఇన్నింగ్స్..

తొలుత బ్యాటింగ్ చేసిన సోమర్ సెట్ 20 ఓవర్లలో 144 పరుగులు చేసింది. సోమర్‌సెట్‌లో టామ్ బాంటన్ 39 పరుగులు చేశాడు. సర్రే తరపున విల్ జాక్వెస్ 58 బంతుల్లో అజేయంగా 66 పరుగులు చేశాడు. సర్రే 10 మ్యాచ్‌లలో 9 గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. 10 మ్యాచ్‌లు ఆడిన సోమర్‌సెట్ మూడు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది.