IND VS SA, 5th T20I: భారత బౌలర్ల మధ్య వికెట్ల ‘వార్’.. ముగ్గురిలో అగ్రస్థానం ఎవరికి దక్కేనో?
ప్రస్తుత టీ20 సిరీస్‌లో భారత బౌలర్లు అద్భుతంగా రాణించారు. ఫాస్ట్ బౌలర్లు భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, యుజువేంద్ర చాహల్ ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌లకు చుక్కలు చూపిస్తున్నారు.
ఢిల్లీ, కటక్‌లలో వరుసగా రెండు టీ20 మ్యాచ్‌ల్లో ఓడిపోయిన భారత జట్టు సిరీస్‌లో పునరాగమనం చేసింది. విశాఖపట్నంలో జరిగిన మ్యాచ్‌లో గెలిచిన టీమ్ ఇండియా, ఆ తర్వాత రాజ్‌కోట్‌లో కూడా దక్షిణాఫ్రికా టీంకు రెండో ఓటమిని చవి చూపించింది. దీంతో ప్రస్తుతం ఇరు జట్లు చెరో రెండు విజయాలతో సిరీస్‌లో సమానంగా నిలిచాడు. ఇక నేడు బెంగుళూరు వేదికగా ఆఖరి పోరు జరగనుంది. ఇక్కడే సిరీస్ విజేతను నిర్ణయించనున్నారు. అయితే ఈ ఫైనల్ మ్యాచ్‌కు ముందు భారత జట్టులోని ముగ్గురు ఆటగాళ్ల మధ్య ‘వార్’ నడుస్తోంది. వార్ అంటే నిజంగానే అనుకునేరు.. ఇక్కడ మేం చెప్పేది వికెట్ వార్ గురించి మాత్రమే. వారెవరో ఇప్పుడు తెలుసుకుందాం..
- ప్రస్తుత టీ20 సిరీస్‌లో భారత బౌలర్లు అద్భుతంగా రాణించారు. ఫాస్ట్ బౌలర్లు భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, యుజువేంద్ర చాహల్ ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌లకు చుక్కలు చూపిస్తున్నారు. అయితే ఫైనల్ మ్యాచ్‌లో ఈ ముగ్గురు బౌలర్ల మధ్య హోరాహోరీ పోటీ జరగనుంది.
- ప్రస్తుత టీ20 సిరీస్‌లో అత్యధికంగా 7 వికెట్లతో హర్షల్ పటేల్ నంబర్ 1 స్థానంలో ఉన్నాడు. అతని ఎకానమీ రేటు కూడా కేవలం 7.23గా నిలిచింది. తన స్లో బాల్స్‌తో ఈ భారత ఫాస్ట్ బౌలర్ దక్షిణాఫ్రికాను విపరీతంగా దెబ్బతీశాడు.
- అయితే హర్షల్ పటేల్ కంటే భువనేశ్వర్ కుమార్ ఒక్క అడుగు వెనుకంజలో నిలిచాడు. భువీ 4 మ్యాచ్‌ల్లో 6 వికెట్లు తీశాడు. అలాగే అతని ఎకానమీ రేటు 6.07 మాత్రమే. పవర్‌ప్లేలో విధ్వంసం సృష్టించిన భువీ స్వింగ్ బంతులు దక్షిణాఫ్రికాను చాలా ఇబ్బంది పెట్టాయి.
- యుజ్వేంద్ర చాహల్ కూడా భువీతో సమానంగా 6 వికెట్లు పడగొట్టాడు. టీమ్ ఇండియా లెగ్ స్పిన్నర్ 9.66 ఎకానమీ రేటుతో పరుగులు ఇచ్చాడు. కానీ ఈ ఆటగాడు వికెట్లు తీయడంలో మాత్రం ఏమాత్రం తగ్గలేదు. గత రెండు మ్యాచ్‌ల్లో మిడిల్ ఓవర్లలో చాహల్ దక్షిణాఫ్రికాను చాలా ఇబ్బంది పెట్టాడు. ఇక సిరీస్‌లోని చివరి మ్యాచ్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టే పోరులో ఎవరు గెలుస్తారో బెంగళూరులో మ్యాచ్ ముగిసిన తర్వాతే తేలిపోతుంది.
ఇవి కూడా చదవండి