Cricket News: ‘పాయింట్ బ్లాక్‌లో గన్ పెట్టి, నగ్నంగా నిలబెట్టి కొట్టారు’: మాజీ క్రికెటర్
ఇంట్లో నుంచి కిడ్నాప్ చేసి.. ఎక్కడికి తీసుకెళ్లారో తెలియదన్న గిల్.. కళ్లకు గంతలు కట్టి కారులో పడేశారని, మారణాయుధాలతో బెదిరించి.. సుమారు గంటన్నర పాటు..
కిడ్నాప్ వ్యవహారంపై ఆసీస్ మాజీ క్రికెటర్ స్టువర్ట్ మెక్ గిల్ ఎట్టకేలకు నోరు విప్పాడు. గతేడాది మార్చిలో తన నివాసంలోనే మెక్‌గిల్‌ను కిడ్నాప్ అయ్యాడు. సిడ్నీలో జరిగిన ఈ వ్యవహారం అప్పట్లో పెను సంచలనం సృష్టించింది. అయితే, ఇది జరిగిన 15 నెలల తర్వాత మెక్‌గిల్ అసలు విషయం బయటపెట్టాడు. ఆ ఘటనను తలుచుకుంటేనే చాలా భయమేస్తోందని గిల్ తెలిపాడు. శత్రువులకు కూడా అలా జరుగకూడదరని కోరుకుంటున్నాడు.
‘ఇంట్లో నుంచి కిడ్నాప్ చేసి.. ఎక్కడికి తీసుకెళ్లారో తెలియదన్న గిల్.. కళ్లకు గంతలు కట్టి కారులో పడేశారని, మారణాయుధాలతో బెదిరించి.. సుమారు గంటన్నర పాటు కారులో తిప్పారన్నాడు. ఒక చోటుకు తీసుకెళ్లిన తర్వాత పాయింట్ బ్లాక్‌లో గన్ పెట్టి, బట్టలన్నీ విప్పేసి నగ్నంగా నిల్చోబెట్టి దారుణంగా కొట్టారని గిల్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆ తర్వాత విడిచి వెళ్లిపోయారన్నారు. మళ్లీ వచ్చిన దుండగులు కారులో బెల్మోర్ సిటీలో విడిచిపెట్టి పరారయ్యారని, జరిగిన గతాన్ని గిల్ గుర్తు చేసుకున్నారు. కిడ్నాప్ చేసిన దుండగులు అరెస్ట్ అయ్యారని తెలుసుకొని తిరిగి ఇంటికి చేరుకున్నాడు. కానీ, ఆ మూడు నెలలు మాత్రం చాలా నరకం అనుభవించానని’ ఆవేదన వ్యక్తం చేశాడు. కానీ, ఈ కేసులో మెక్ గిల్ భార్య తమ్ముడి హస్తం ఉందని తేలడంతో అంతా ఆశ్చర్యపోయారు.