Cricket: గ్రౌండ్‌లోకి అభిమాని రచ్చ.. క్రికెటర్ వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చి..! ఎం చేసాడో చుస్తే షాకే..
క్రికెట్‌లో అప్పుడప్పుడు అభిమానులు మైదానంలోకి పరుగెత్తుకొచ్చి తమ ఆరాధ్య క్రికెటర్లను కలుసుకోవాలని, వారికి షేక్ హ్యాండ్లు ఇచ్చి సంబరపడాలని ప్రయత్నించడం పరిపాటే. ఎన్నోసార్లు ఇలాంటి సంఘటనలు మనం చూస్తూనే ఉంటాం.
క్రికెట్‌లో అప్పుడప్పుడు అభిమానులు మైదానంలోకి పరుగెత్తుకొచ్చి తమ ఆరాధ్య క్రికెటర్లను కలుసుకోవాలని, వారికి షేక్ హ్యాండ్లు ఇచ్చి సంబరపడాలని ప్రయత్నించడం పరిపాటే. ఎన్నోసార్లు ఇలాంటి సంఘటనలు మనం చూస్తూనే ఉంటాం. అయితే, తాజాగా ఓ పాకిస్థాన్ అభిమాని కూడా అలాగే చేశాడు. మ్యాచ్ జరుగుతుండగా తనకు ఇష్టమైన క్రికెటర్ వద్దకు వెళ్లి సెల్యూట్ చేశాడు. దీంతో ఆ క్రికెటర్ అతడికి జీవితంలో మర్చిపోలేని బహుమతి ఇచ్చాడు. దీంతో అందరి మన్ననలు పొందాడు.పాకిస్థాన్, వెస్టిండీస్ జట్ల జరిగిన ఓ వన్డే మ్యాచ్‌లో ముల్తాన్ వేదికగా జరిగిన రెండో వన్డేలో పాక్ ఆల్‌రౌండర్, వైస్ కెప్టెన్ షాదాబ్ ఖాన్ 9 పరుగుల వద్ద బ్యాటింగ్ చేస్తున్నాడు. ఆ సమయంలో ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు కానీ, ఓ వ్యక్తి హఠాత్తుగా మైదానంలోకి పరుగెత్తుకొచ్చి క్రీజులో ఉన్న షాదాబ్ వద్దకెళ్లాడు. ఆ క్రికెటర్‌కు సెల్యూట్ చేసి తన అభిమానాన్ని చాటుకున్నాడు. దీంతో పాక్ క్రికెటర్ కూడా అంతే ఆప్యాయంగా స్పందిస్తూ ఆ అభిమానిని ప్రేమగా హత్తుకున్నాడు. దానికి ఉప్పొంగిపోయిన అతడు స్టేడియంలోనే సంబరపడ్డాడు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Unburnable Book: ఈ పుస్తకం ఓ అద్భుతం… మంటల్లో వేసినా కాలిపోదు.. చెక్కుచెదరదు..!
Viral Video: వరుడు లేని పెళ్లి.. తనను తానే వివాహం చేసుకున్న క్షమా.! వీడియో చుస్తే ఫ్యూజులు అవుటే..
Cris Gaera: బ్రెజిల్ మోడల్‌కి బంపర్ ఆఫర్.. రూ. 38లక్షలు ఇచ్చి అలా అడిగాడు..